Begin typing your search above and press return to search.
పీఎం ఎవరో తేల్చడానికి డేట్ ఫిక్స్ చేసిన బాబు!
By: Tupaki Desk | 2 May 2019 7:45 AM GMTతెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ విషయం కన్నా నేషనల్ పాలిటిక్స్ మీదే చాలా ఎక్కువ ఇంట్రస్ట్ ఉన్నట్టుంది! బాబు ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి గా ఎవరుండాలనే అంశం గురించి చర్చను చేపట్టారట. ఈ మేరకు తన పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు ఈ పాయింట్ గురించి చెప్పారట. ప్రధానిగా ఎవరుండాలనే అంశం గురించి నిర్ణయించడానికి బాబు డేట్ కూడా ఫిక్స్ చేశారట.
ఎన్నికల ఫలితాలు మే ఇరవై మూడున రాబోతున్నాయి కదా.. అంతకు రెండు రోజులకు ముందు ప్రధాని అభ్యర్థి ఎవరనే అంశం గురించి డిసైడ్ చేయబోతున్నట్టుగా చంద్రబాబు నాయుడు తన పార్టీ వాళ్లతో చెప్పారట. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పక్షాలు ఆ రోజున సమావేశం అవుతాయని.. ఆ సమావేశంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే అంశం గురించి డిసైడ్ చేయబోతున్నట్టుగా చంద్రబాబు నాయుడు తన పార్టీ వాళ్లతో చెప్పారట!
ఈ మేరకు బాబు చెప్పినట్టుగా మీడియాకు లీకు ఇచ్చారు తెలుగుదేశం నేతలు. అయినా ఇది కొంచెం ఓవర్ గా అనిపించక మానదు.
ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చాలా పార్టీలే ఉన్నా.. వారిలో ఐక్యత అయితే కనిపించడం లేదు. ఆ పార్టీలన్నీ శత్రుపక్షాలుగా వివిధ రాష్ట్రాల్లో పోరాడుతూ ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీలు వర్సెస్ కాంగ్రెస్ పోరాటం కేరళ - బెంగాల్ లలో సాగుతూ ఉంది.
అదే బెంగాల్ లో మమతా బెనర్జీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ యుద్ధమే సాగుతోంది. ఇక యూపీలో ఎస్పీ-బీఎస్పీల అవకాశాలను కాంగ్రెస్ దెబ్బ తీస్తూ ఉంది. ఇలా వీళ్లంతా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమే అయినా.. వీళ్లంతా ఒక కూటమి అయితే పోటీ చేయలేదు.
ఇలాంటి పార్టీలు ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయానికి వస్తాయనేది నమ్మదగిన అంశంలా కనిపించడం లేదు. అందుకే ఆ పార్టీలేవీ ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం అనే ఊసునే ఎత్తడం లేదు. చంద్రబాబు మాత్రం డేట్ కూడా ప్రకటించేశారు! మరి ఎన్నికలకు ముందు అలాంటి సమావేశం జరుగుతుందో లేదో!