Begin typing your search above and press return to search.
బీజేపీ కోసం పార్టీ మంత్రిని అవమానిస్తున్న బాబు
By: Tupaki Desk | 14 Aug 2016 8:52 AM GMTతెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కొత్త ఆరోపణ వస్తోంది. స్వయంగా చంద్రబాబు నిర్వహించిన సర్వేలోనే నంబర్ వన్‌లో ఉన్న మంత్రిని పట్టించుకోలేదని సదరు ఆరోపణ సారాంశం. పైగా అగ్రవర్ణ మంత్రికి పెద్ద పీట వేసేందుకు ఈ దళిత మంత్రి గారిని చిన్నచూపు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జెండా వందనం గురించి ఈ చర్చ నడుస్తోంది.
జిల్లాలో ఇద్దరు మంత్రులుండగా అందులో ఒకరు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, మరొకరు గనులు - స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఎగురవేసే అవకాశం చేసే హ్యాట్రిక్ ఛాన్స్ కూడా మాణిక్యాలరావుకే దక్కింది. ఇప్పటివరకూ రెండుసార్లు ఆయనకే ప్రొటోకాల్ బాధ్యతలు అప్పజెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం కూడా బీజేపీ మంత్రికే చాన్స్ ఇచ్చింది. దీంతో టీడీపీ - బీజేపీ మధ్య నెలకొన్న విభేదాల దృష్ట్యా ఈసారైనా టీడీపీకి చెందిన దళిత మహిళా మంత్రి పీతల సుజాతకు ఆ అవకాశం కల్పిస్తుందన్న వారి ఆశ నిరాశ అయిందంటున్నారు. అందుకు భిన్నంగా మాణిక్యాలరావుకే జెండా వందనం బాధ్యతను అప్పగించడం ద్వారా బీజేపీపై ఉన్న ప్రేమను టీడీపీ మరోసారి వెల్లడించినట్లైందనే చర్చ సాగుతోంది.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుజాత వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. కోస్తా జిల్లాల్లో ఏకైక దళిత మహిళా మంత్రిగా చంద్రబాబు కేబినెట్ లో కొనసాగుతున్న ఆమెను పక్కన పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పనితీరులో మొదటి స్థానంలో నిలిచినా ప్రొటోకాల్ లో చివరి స్థానంలో ఉంచడం ద్వారా పార్టీలో దళితులకు ప్రాధాన్యత లేదన్న విషయాన్ని చెప్పదల్చుకున్నారా అంటూ మండిపడుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ నుంచి ఇద్దరు మాత్రమే మంత్రులు ఉన్నారు. ఒకరు తాడేపల్లిగూడెంకు చెందిన పైడికొండల మాణిక్యాలరావు కాగా, మరొకరు కృష్ణాజిల్లా కైకలూరు నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస్. కృష్ణా జిల్లాలో కామినేని శ్రీనివాస్ ను పక్కనపెట్టి టీడీపీకి చెందిన జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు జెండా వందనం చేసే అవకాశం ఇస్తూ వస్తున్న ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చేసరికి దళిత వర్గానికి చెందిన సుజాతను తప్పించి మాణిక్యాలరావుకు అవకాశం ఇస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది.