Begin typing your search above and press return to search.
బాబు మాటిచ్చాడు.. ఆఫీసర్లు తూచ్ అన్నారు!
By: Tupaki Desk | 4 Sep 2016 5:04 AM GMTముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి.. ఏ హామీ ఇస్తే అది ఖచ్చితంగా నెరవేరితీరుతుందని అందరూ అనుకుంటారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా? అన్న సామెత చందంగా అన్నమాట. కానీ సీఎం హామీ ఇచ్చినా కూడా అధికార్లు అడ్డుపుల్లలు వేసేసి - తూచ్ అలా చేయడం కుదర్దు అంటూ గుండె గుభేల్ మనిపించేస్తే ఏం చేయాలి? ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఇచ్చిన హామీని నమ్మి వందల కోట్లు పెట్టుబడి పెట్టిన వారు ఏమైపోవాలి? ఇప్పుడు ఏపీలో ఇటీవల ప్రారంభించిన ఇసుజు యూనిట్ విషయంలో అదే జరుగుతోంది.
జపాన్‌కు చెందిన ఇసుజు వాహనాల తయారీ యూనిట్ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్ వద్ద పెట్టడానికి చంద్రబాబు అప్పట్లో చాలా వరాలు గుప్పించారు. తీరా ప్రతిష్ఠాత్మకమైన ఇసుజు యూనిట్ ఏపీకే వచ్చింది. చాలా మందికి ఉద్యోగావకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. అయితే యూనిట్ రావడానికి... వారిక్కడ తయారుచేసే వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తానంటూ.. అప్పట్లో బాబు మాట ఇచ్చారు. దాంతో యూనిట్ వచ్చింది. తీరా ఇప్పుడు ఇసుజు మేనేజిమెంట్ తో, అలా కుదరదంటూ అధికారులు నో అంటున్నారట.
పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతే.. ఇసుజు వంటి సంస్థ ఆ విషయాన్ని జపాన్ లో నలుగురికీ చెబితే గనుక.. పూర్తిగా పరువు పోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా సీఎం స్థాయిలోని వ్యక్తి మనస్ఫూర్తిగా చేయదలచుకుంటే, ఇచ్చిన మాటను నిలబెట్టుకోదలచుకుంటే ఇదేమీ పెద్ద విషయం కాదనీ, ఇప్పటికీ ఫైలు చంద్రబాబు వద్దకు వెళ్లలేదు గనుక.. ఆయన తలచుకుంటే మాట నిలబెట్టుకోవచ్చుననీ కొందరు అంటున్నారు.