Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు ఆ ఉద్య‌మం నుంచి త‌ప్పుకున్న‌ట్టేనా?

By:  Tupaki Desk   |   30 Jan 2020 3:30 PM GMT
చంద్ర‌బాబు ఆ ఉద్య‌మం నుంచి త‌ప్పుకున్న‌ట్టేనా?
X
మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా తెలుగుదేశం పార్టీ గ‌ళం విప్పింది. అంతా అమ‌రావ‌తి నుంచినే జ‌ర‌గాల‌ని చంద్ర‌బాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ ఉద్య‌మంలో చంద్ర‌బాబు నాయుడి కుటుంబీకులు కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం నేత‌లంతా ఆ మేర‌కు మాట్లాడారు. ఇక విరాళాల సేక‌ర‌ణ కూడా మొద‌లుపెట్టారు చంద్ర‌బాబు నాయుడు. జోలె ప‌ట్టి కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను అయితే సాధించారు. అయితే వికేంద్రీక‌ర‌ణ బిల్లును మాత్రం చంద్ర‌బాబు అడ్డుకో లేర‌ని స్ప‌ష్టం అవుతోంది.

మండ‌లిలో ఆ బిల్లును టీడీపీ అడ్డుకోవ‌చ్చు గాక అది తాత్కాలిక‌మే అని టీడీపీ నేత‌లే చెబుతున్నారు. ఇక ఇప్పుడు మండ‌లే ర‌ద్దు అయ్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అందుకు సంబంధించి ప‌రిణామాలు ఢిల్లీకి మారాయి. మ‌రోవైపు అమ‌రావ‌తిలో ఆందోనలు కొన‌సాగుతూ ఉన్నాయి. న‌ల‌భై నుంచి యాభై య‌వ రోజుల దిశ‌గా అమ‌రావ‌తి ఆందోళ‌న‌లు కొన‌సాగుతూ ఉన్న‌ట్టున్నాయి. అయితే ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు అటుగా వెళ్ల‌డం ఆగిపోయింది!

మొద‌ట్లోనేమో అమ‌రావ‌తి రైత‌ల‌కు సంఘీభావం అన్నారు. ప్ర‌భుత్వం ఏం చేయ‌ల‌ని తెలుగుదేశం అధినేత ప్ర‌కటించారు. అమ‌రావ‌తి ఉద్య‌మానికి నిధుల సేక‌ర‌ణ ప్ర‌క‌టించారు. అయినా ఉద్య‌మాల‌కు నిధులు ఎందుకో ఎవ‌రికీ తెలియ‌దు. అలా వ‌సూళ్లు అయితే బాగానే వ‌చ్చాయి కానీ, ఆ నిధుల‌తో ఏం చేస్తున్న‌ట్టో ఎవ‌రికీ తెలియ‌దు. మ‌రో వైపు ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేస్తూ పోతోంది. అయితే చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు మ‌ళ్లీ బ‌య‌ట‌కు రావ‌డం లేదని స‌మాచారం.

ఆయ‌న తెలుగుదేశం కార్యాల‌యానికి ప‌రిమితం అవతూ.. వ‌చ్చి పోయే వారితో ఫోటోలు దిగుతున్నార‌ట‌. ఇలాంటి నేప‌థ్యంలో అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని చంద్ర‌బాబు నాయుడు అట‌క ఎక్కించిన‌ట్టేనా? అనే అనుమానాలు క‌లుగుతూ ఉన్నాయి. అమ‌రావ‌తికి అనుకూలంగా మాట్లాడటం వ‌ల్ల చంద్ర‌బాబు నాయుడు రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌ల్లో కావాల్సినంత వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్నారు. అందులోనూ అమ‌రావ‌తి లో తెలుగుదేశం పార్టీ వాళ్లు, చంద్ర‌బాబు సొంత సామాజిక‌వ‌ర్గం వారు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశార‌నే అభిప్రాయాలూ బ‌లంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అది తెలుగుదేశం పార్టీ పై ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌ సీమ‌ల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త‌ కు దారి తీస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌తో చంద్ర‌బాబు కూడా వెనుక్కు త‌గ్గిన‌ట్టే అని..అమ‌రావ‌తి ఉద్య‌మం లో ఇక చంద్ర‌బాబు నాయుడు డైరెక్టు గా పాల్గొనే అవ‌కాశాలు లేవ‌నే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి!