Begin typing your search above and press return to search.
బాబూ.. ఏంటి నీ ప్రశ్నలు
By: Tupaki Desk | 13 Sep 2017 4:32 AM GMTమనవాళ్లు ఉత్త వెధవాయ్ లోయ్ అని కన్యాశుల్కంలో ఒక పాత్ర తో అనిపించాడు మహాకవి గురజాడ అప్పారావు. ఈ వాక్యం ఇప్పుడెందుకు రాశాననేగా మీ డౌట్? అయితే ఇది చదవండి ముందు.. తమ ఎమ్మెల్యేలు - ఎంపీలు - మంత్రులు - ఎమ్మెల్సీలు పార్టీ నియోజకవర్గాల ఇంఛార్జిలను వచ్చే ఎన్నికలకు కార్యోన్ముముఖులను చేయడానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన వర్క్ షాప్ అభాసుపాలైంది. రెండో రోజు వర్క్ షాపు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది.
ప్రారంభ ఉపన్యాసం ముగిసిన తర్వాత చంద్రబాబు ఎంత మంది ట్యాబులు తీసుకొచ్చారని ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. సగంమంది ఎమ్మెల్యేలు మాత్రమే చేతులెత్తారు. ట్యాబుల ఆపరేట్ చేయడం ఎంతమందికి వచ్చు అంటూ మరో ప్రశ్నసంధించగా కొంతమంది ఎమ్మెల్యేలు నిజాయతీగా చేతులెత్తలేదు. దీంతో కనీసం మీకు సెల్ ఫోన్ ఆపరేట్ చేయడమైనా వచ్చా అని చంద్రబాబు మళ్లీ ప్రశ్నించారు. సెల్ ఫోన్ ది ఏముందండి చక్కగా ఆపరేట్ చేస్తామన్నారు ఎమ్మెల్యేలు. సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తే మరి ట్యాబ్ ను ఎందుకు ఆపరేట్ చేయలేకపోతున్నారంటూ అడిగారు చంద్రబాబు.
తర్వాత ఎమ్మెల్యేలకు ఓ పరీక్ష పెట్టారు. వ్యక్తిత్వ వికాసాన్ని - స్వభావాలను తెలుసుకోవడానికి ఓ చిన్న ప్రశ్నావళిని వారి ట్యాబ్ లోకి పంపించారు. ఆ ప్రశ్నావళిని వెంటనే పూర్తి చేసి ట్యాబులు క్లోజ్ చేయాలని సూచించారు. పరీక్ష చిన్నదే అయినప్పటికీ ఎమ్మెల్యేలకు అదే పెద్ద పరీక్షగా నిలిచింది. చాలామంది ఎమ్మెల్యేలు కంగారుపడ్డారు. ఓ మాజీ మంత్రి అయితే తీవ్ర ఆందోళనకు గురై పక్కనున్న వారితో ప్రశ్నలు చెప్పించుకున్నాడంట. ఇవండీ బాబుగారి పరీక్షలు.. ప్రశ్నలు.