Begin typing your search above and press return to search.
బాలయ్య స్పీచ్ తో బాబు బీపీని పదే పదే చెక్ చేశారు
By: Tupaki Desk | 21 April 2018 3:30 PM GMTముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న చేసింది దీక్ష కాదని, చేసిన పాపాలు పోవడానికే ఉపవాసాలు చేశారని వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఆయన దీక్ష సారాంశం ఏంటో అర్థం కావడం లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా అంత ప్రోగ్రెసివ్ సీఎం ఎవరు లేరని చంద్రబాబు చెబితే మీడియా కూడా నమ్ముతూ వచ్చారన్నారు. చంద్రబాబు సీఎం కాకముందు ఐటీ ఎగుమతులు దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉండేదన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి ఆ స్థానాన్ని ఐదో ప్లెస్కు తీసుకెళ్లారన్నారు. 1995లో చెన్నైలో ఐటీ పరిశ్రమ లేదని, అలాంటి తమిళనాడు అనాతికాలంలోనే మూడో స్థానంలో వచ్చిందన్నారు. అయితే ఏ రోజు కూడా అక్కడి సీఎంలు ఐటీ పరిశ్రమపై చంద్రబాబులా ప్రచారం చేయలేదన్నారు. చంద్రబాబు పాలనలో ఐటీ పరిశ్రమ జీరో అన్నారు.
చంద్రబాబు దీక్ష పై విపరీతమైన ప్రచారం చేశారని… అది దీక్ష ఏమాత్రం కాదని.. కేవలం కొన్ని గంటల పాటు చేసిన ఉపవాసం అని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బాబుదీక్షలో మనుషులుకంటే ఎక్కువగా ఎయిర్ కూలర్ లు ఉన్నాయన్నారు. అలాగే.. అది దీక్ష కాదని.. ఓ మహారాజు కూర్చీపైన కూర్చున్న దర్బారులా వుందని ఆరోపించారు. 40ఇయర్స్ ఇండస్ట్రీ వల్ల ఏమి ఉపయోగం లేదని గతంలో తొమ్మిదేళ్ల పాలనలో కూడా ఇలాంటి షోనే జరిగిందని వివరించారు. ఇంకా అసలు మీరు ఏ రాజధాని కట్టలేదని.. ఏమి చేయలేదని.. ప్రచార ఆర్భాటంతో అద్భుతమని క్రియేట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా చంద్రబాబు దీక్ష అంటూ పండుగ చేశారని… ప్రత్యేక హోదా సాధించిన రోజు నిజమైన పండుగ చేసుకుందామని రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. నాలుగేళ్లలో రాజధానికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదని, కేవలం ప్రచారంతో కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు.
దీక్ష సందర్భంగా బాలకృష్ణ స్పీచ్ ను చూసి చంద్రబాబుకు పదే పదే బీపీ చెక్ చేశారని బుగ్గన ఎద్దేవా చేశాన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని, వ్యవసాయాన్ని విస్మరించారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని గాలికొదిలారన్నారు. నీరు–చెట్టు కార్యక్రమంలోనూ అవినీతి జరిగిందన్నారు. ఇందులో అవినీతి జరిగిందని కాగ్ నివేదికలో ఎత్తి చూపిందని గుర్తు చేశారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, భూమి పట్టాల ఆన్లైన్ కోసం డబ్బులు వసూల్ చేస్తున్నారని ఆరోపించారు. ఆఖరికి మరుగుదొడ్లు నిర్మాణంలోనూ అవినీతి జరిగిందని విమర్శించారు. ప్రజల సొమ్మును తెలుగుదేశం కార్యకర్తలకు పంచుతున్నారు. గృహ నిర్మాణ పథకంలో జన్మభూమి కమిటీల్లోని సభ్యులు సంతకానికి ఇరవై ఐదు వేలు ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. అదేవిధంగా.. రెవిన్యూ శాఖలో.. ఆన్ లైన్రికార్డ్ ల్లోకి వివరాలు చేర్చాలంటే పది వేలు ఇవ్వాల్సి వస్తుందని.. ఇలా అన్నిచోట్లా జరుగుతున్న అవినీతితో రైతులు వాపోతున్నారని వివరించారు.