Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రుల ర్యాంకుల లెక్క ఇదే..

By:  Tupaki Desk   |   19 April 2016 4:09 AM GMT
ఏపీ మంత్రుల ర్యాంకుల లెక్క ఇదే..
X
ఆ మధ్యన ఏపీ మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చేయటం తెలిసిందే. తాజాగా అలాంటి పద్ధతినే మరోసారి ఫాలో అయినట్లుగా కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల పని తీరు.. ఎమ్మెల్యేల పని తీరు.. పార్టీ నేతల పని తీరు మీద ఒక సర్వే నిర్వహించినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి మంత్రుల ర్యాంకులు బయటకు వచ్చాయి. అనధికారికంగా విడుదల చేసిన ఈ ర్యాంక్ కార్డులో 18 ర్యాంకులకు సంబంధించిన సమాచారమే బయటకు వచ్చింది. మిగిలిన ర్యాంకులు రాలేదు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మంత్రి నారాయణ బయటకు వచ్చిన జాబితాలో ఆఖరులో (18వ స్థానంలో) నిలవగా.. ఆయన మాత్రం తనకు ఆరో ర్యాంకు వచ్చినట్లుగా చెప్పుకోవటం గమనార్హం. ఏపీ టీడీపీలో హాట్ టాపిక్ అయిన ఈ అనధికార ర్యాంకుల్ని వరుసగా లెక్క చూస్తే..

1. పీతల సుజాత

2. దేవినేని ఉమామహేశ్వరరావు

3. పత్తిపాటి పుల్లారావు

4. కామినేని శ్రీనివాసరావు

5. పరిటాల సునీత

6. రావెల కిశోర్ బాబు

7. అచ్చెన్నాయుడు

8. గంటా శ్రీనివాసరావు

9. కొల్లు రవీంద్ర

10. చింతకాయల అయ్యన్నపాత్రుడు

11. పల్లె రఘునాథ రెడ్డి

12. మాణిక్యాలరావు

13. కిమిడి మృణాళిని

14. కామినేని శ్రీనివాస్

15. యనమల రామకృష్ణుడు

16. పైడికొండల మాణిక్యాల రావు

17. కేఈ కృష్ణమూర్తి

18. అయ్యన్నపాత్రుడు

19. నారాయణ