Begin typing your search above and press return to search.

బాబోయ్‌..బాబు హ‌డావుడి మొద‌లైందండోయ్‌!

By:  Tupaki Desk   |   9 July 2018 4:27 AM GMT
బాబోయ్‌..బాబు హ‌డావుడి మొద‌లైందండోయ్‌!
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు మ‌రోసారి త‌న‌ను ఆదుకునే అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీశారు. త‌న గ్రాఫ్ ఏమాత్రం ప‌డిపోతుంద‌న్న భావ‌న క‌లిగినా..ఆయ‌న వెంట‌నే విదేశీ ప‌ర్య‌ట‌న చేప‌డ‌తారు. దేశంలో మ‌రే రాష్ట్ర ముఖ్య‌మంత్రి చేయ‌ని రీతిలో త‌ర‌చూ విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేసే ఆయ‌న‌.. రాష్ట్రంలో పెట్టుబ‌డుల వేట‌కు బ‌య‌లుదేరిన‌ట్లుగా చెప్పుకుంటారు. ఆయ‌న మాట‌ల‌కు త‌గ్గట్లే బాబు భ‌జ‌న చేసే మీడియా బ్యాచ్ మ‌రింత హుషారుగా త‌మ క‌లాల్ని ప‌రుగులు తీయిస్తుంటారు.

ఓప‌క్క త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు జ‌గ‌న్‌.. ప‌వ‌న్ లు ఇద్ద‌రూ యాత్ర‌లు చేస్తూ త‌న పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్న వేళ‌.. బాబు మాత్రం పెట్టుబ‌డుల వేట పేరుతో సింగ‌పూర్ యాత్ర‌ను చేస్తున్నారు. ఎప్ప‌టి మాదిరే.. పెద్ద ఎత్తున పారిశ్రామిక‌వేత్త‌ల‌తో భేటీ అవుతూ.. ఫోటోలు తీయించుకుంటున్న చంద్ర‌బాబు.. రాష్ట్రంలో తాము స్టార్ట్ చేస్తున్న వివిధ ప్రాజెక్టుల గురించి వివ‌రించ‌టం.. దానికి స్పందిస్తూ పెద్ద ఎత్తున కంపెనీలు ముందుకు వ‌చ్చి వ్యాపారాలు స్టార్ట్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లుగా చెప్పుకోవ‌టం మొద‌లైంది.

నిజానికి ఇదంతా ఒక ఫార్సు మాదిరి న‌డ‌వ‌టం తెలిసిందే. గ‌డిచిన నాలుగేళ్ల కాలంలో ప‌లు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేయ‌టంతో పాటు.. పెట్టుబ‌డుల సేక‌ర‌ణ‌కు ప్ర‌త్యేక భేటీలు పెట్ట‌టం.. ల‌క్ష‌ల కోట్ల రూపాయిల పెట్టుబ‌డుల‌కు ఎంవోయూలు చేసుకున్న‌ట్లుగా ప్ర‌చారం చేసుకోవ‌టం క‌నిపిస్తుంది.

ఇంతా అయ్యాక‌.. పెట్టుబ‌డులు ఎన్ని ఏపీకి వ‌చ్చాయి? ఎన్ని కంపెనీలు రాష్ట్రానికి వ‌చ్చాయ‌న్న‌ది చూస్తే.. అంతా ప్ర‌చార హ‌డావుడి త‌ప్పించి మ‌రింకేమీ లేద‌న్న వైనం ఇట్టే క‌నిపిస్తుంది. తాజాగా సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న చేస్తున్న సీఎం చంద్ర‌బాబు.. త‌న ప్ర‌చార హ‌డావుడిని షురూ చేసేశారు. ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌టానికి పారిశ్రామిక‌వేత్త‌లు పోటీ ప‌డుతున్న‌ట్లుగా ప్ర‌చారం చేసుకోవ‌టం క‌నిపిస్తోంది.

ఎక్క‌డెక్క‌డి కంపెనీల‌న్ని పోలోమంటూ ఏపీకి వ‌చ్చేసిన‌ట్లుగా ప్రెస్ నోట్ల‌తో హ‌డావుడి చేయ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లే బాబును మొన‌గాడిగా చూపించే మీడియా చెల‌రేగిపోయి.. ఏపీ ప్ర‌జ‌ల‌కు క‌ల‌ర్ సినిమాను చూపించే ప్ర‌య‌త్నాన్ని మొద‌లుపెట్టాయి. బాబుకు వ్య‌తిరేక‌మ‌న్న‌ట్లుగా మీరు ఫీల్ కావొచ్చు. కానీ.. ఇది నిజం.కావాలంటే ఇప్పుడు చెప్పే కంపెనీల పేర్ల‌ను ఓ ప‌క్క‌న రాసి పెట్టుకోండి. ఎన్ని కంపెనీలు ఏపీకి వ‌చ్చి పెట్టుబ‌డులు పెట్టాయ‌న్న‌ది ఏడాది త‌ర్వాత చెక్ చేయండి. అప్పుడు తెలుస్తుంది మేం చెప్పింది ఎంత వ‌ర‌కూ నిజ‌మ‌న్న‌ది.

ఇక‌.. తాజాగా హ‌డావుడి చేస్తున్న కంపెనీలు.. వాటి ప్రాజెక్టులు చూస్తే.. ఒళ్లు పుల‌క‌రించ‌ట‌మే కాదు.. ఏపీ ఎక్క‌డికో వెళ్లిపోతుంద‌న్న భావ‌నను క‌లిగించ‌టంతో మాత్రం బాబు అండ్ కో ఫుల్ స‌క్సెస్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏపీని ఎక్క‌డికో తీసుకెళ్లే అవ‌కాశం ఉన్న ప్రాజెక్టుల‌పై బాబు చెబుతున్న కంపెనీలు చూస్తే..

+ భారత్‌ లో పెట్టాల‌నుకుంటున్నమెట్రో రైల్‌ తయారీ కర్మాగారం ఏర్పాటుకు ఏపీ అత్యంత అనుకూలమైందిగా భావిస్తున్నామని మలేషియాకు చెందిన ఎస్ ఎంహెచ్‌ రైల్‌ కార్పొరేషన్‌ తెలిపింది.

+ బ్యాటరీల తయారీ - ఇంధన నిల్వ రంగంతో సహా ఫ్లోటింగ్‌ స్టోరేజ్‌ రీగ్యాసిఫికేషన్‌ కు సంబంధించి వివిధ యూనిట్లు నెలకొల్పేందుకు ఆస్ర్టేలియా కంపెనీ ఫోర్టెస్క్‌ మెటల్స్‌ గ్రూప్‌ ఆసక్తి వ్యక్తం చేసింది.

+ జర్మనీకి చెందిన అగ్రిబిజినెస్‌ బృందం చంద్రబాబుతో సమావేశమయ్యారు. అగ్రిబిజినెస్‌ రంగంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

+ ఇజ్రాయెల్‌ కు చెందిన ఎలి హజాజ్‌ సంస్థ విమాన విడిభాగాలు తయారుచేసే ఏరో హబ్‌ స్థాపనకు ఆసక్తి చూపింది. భూమిని సమకూరిస్తే ఆరు నెలల్లో తొలి దశ ఉత్పత్తి ప్రారంభిస్తామంది.

+ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ లోథా గ్రూపు అమరావతిలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మాల్స్‌ - ఓపెన్‌ స్పేస్‌ - వినోద రంగాల్లో పెట్టుబడులు పెడతామని పేర్కొంది.

+ తమ ప్లాంట్‌ స్థాపనకు ఏపీ అనువైందిగా భావిస్తున్నామని మలేసియాకు చెందిన ఎస్ ఎంహెచ్‌ రైల్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులు చంద్రబాబుతో అన్నారు. జీఈ - సీమెన్స్‌ - అల్‌ స్టోమ్‌ - హ్యుండయ్‌ వంటి సంస్థలతో తాము కలిసి పనిచేస్తున్నామని - తమ ఉత్పత్తిలో అధికశాతం ఎగుమతులే ఉంటాయని ఆ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ జహ్రీన్‌ జమాన్‌ ముఖ్యమంత్రికి వివరించారు

+ ఆస్ర్టేలియాకు చెందిన ఫోర్టెస్క్‌ మెటల్స్‌ ఐరోపా - ఇండియా - దక్షిణాసియా ముఖ్యప్రతినిధి గౌతమ్ సీఎం చంద్ర‌బాబును కలిశారు. ఐరన్ ఓర్‌ - తీరప్రాంత సహజ వాయువు వెలికితీత రంగాల్లో తమ కంపెనీకి అనుభవం ఉందన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ముందుకు రావాలని కోరగా... తమ అనుబంధ సంస్థలను సంప్రదించి చెబుతామని గౌతమ్‌ హామీ ఇచ్చారు.

+ సింగపూర్‌ కు చెందిన నిర్మాణ రంగ కంపెనీ రాయల్‌ హోల్డింగ్స్‌ ప్రతినిధులతోనూ సీఎం చర్చలు జరిపారు. అమరావతి నిర్మాణంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు సదరు సంస్థకు చెందిన రాజ్‌ కుమార్‌ హీరా నందానీ సుముఖత వ్యక్తం చేశారు.

+ గాలి వాలును అంచనా వేసి ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించే సాంకేతికతను అభివృద్ధి చేసిన డస్సాల్ట్‌ సంస్థ అమరావతిలో ఈ పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు సిద్ధమైంది.

+ ఇజ్రాయెల్‌ కు చెందిన ఎలి హజాజ్‌ బృందం చంద్రబాబుతో భేటీ అయింది. 30 నుంచి 40 పరిశ్రమల స్థాపనకు సరిపడా సదుపాయాలు - ఉత్పాదనకు సరిపోయే సాంకేతిక సామర్థ్యం - సానుకూల వాతావరణం ఏర్పరిచే శక్తి తమకుందని ఆ సంస్థ ఎండీ ఓఫర్‌ గ్యాబినెట్‌ అన్నారు.