Begin typing your search above and press return to search.
‘తమ్ముడి’ మాటలకు బాబు రియాక్ట్ అయ్యారు
By: Tupaki Desk | 28 Aug 2016 12:20 PM GMTజనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో చేసిన ప్రసంగం ప్రభావం ఏపీ రాజకీయాలపై స్పష్టంగా పడింది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ పవన్ మాటలకు రియాక్ట్ అవుతున్నారు. కొందరు పవన్ ను సమర్థిస్తూ మాట్లాడితే.. మరికొందరు విమర్శలు చేశారు. ఇంకొందరు పవన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కూడా. పవన్ ను విమర్శించే క్రమంలో పవన్ కుమాత్రమే కాదు తమకు కూడా ఆవేశం ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ..హావభావాలు ప్రదర్శిస్తూ మండిపడ్డారు.
ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా పవన్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. ప్రత్యేక హోదా విషయంలో తాము గట్టిగా పోరాడుతున్నట్లుగా చెప్పిన ఆయన.. తన జీవితంలో తానెవరికీ భయపడనని స్పష్టం చేశారు. ‘‘నేనెవరికీ భయపడటం లేదు. ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడుతున్నాం’’ అంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు.. కేంద్రంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు విషయంలోనూ మోడీ సర్కారు సహకరించటం లేదన్న ఆరోపణ చేశారు.
ప్రత్యేక హోదా మీద ఎందుకు మాట్లాడరు? ఎందుకంత భయం? అన్న వ్యాఖ్యల్ని ఎవరి పేరు ప్రస్తావించకుండా పవన్ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై బాబు స్పందించటం గమనార్హం. ఇదిలా ఉంటే.. పవన్ ప్రసంగ ప్రభావం బాబు మీద పడినట్లుగా కనిపిస్తోంది. హోదాపై పవన్ ఫైరింగ్ తో ఏపీ బీజేపీ నేతలు డిఫెన్స్ లో పడ్డారు. పవన్ వ్యాఖ్యలపై పలు పార్టీలు స్పందిస్తున్నా బీజేపీ నేతలు మాత్రం నోరు విప్పని పరిస్థితి. ఇదిలా ఉంటే.. పవన్ హోదా వ్యాఖ్యల నేపథ్యంలో బాబు తనదైన శైలిలో గళం విప్పటం ద్వారా ఒత్తిడిని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. హోదాపై వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా మాట్లాడిన బాబు.. హోదా సాధనలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పటం గమనార్హం. ఎప్పుడు ఎలా వ్యవహరించాలో.. ఏ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో అన్న విషయాలు చంద్రబాబుకు ఒకరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.