Begin typing your search above and press return to search.

ఓటుకు నోటుపై చంద్ర‌బాబు రియాక్ష‌న్ చూశారా?

By:  Tupaki Desk   |   6 March 2017 9:11 AM GMT
ఓటుకు నోటుపై చంద్ర‌బాబు రియాక్ష‌న్ చూశారా?
X
ఓటుకు నోటు కేసును విచార‌ణ‌కు స్వీక‌రిస్తూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు చేసిన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌పై టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు చాలా త్వ‌ర‌గానే రియాక్ట్ అయ్యారు. నేటి ఉద‌యం వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో ప్రారంభ‌మైన తొలి అసెంబ్లీ స‌మావేశాల్లో చంద్ర‌బాబు ఉండ‌గానే... ఆయ‌న ముద్దాయిగా ఉన్న ఓటుకు నోటు కేసును విచార‌ణ‌కు స్వీక‌రిస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అయితే అప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ప్రారంభం కావ‌డంతో స‌మావేశాలు వాయిదా ప‌డే దాకా చంద్ర‌బాబుకు కూడా ఈ విష‌యం తెలియ‌ద‌నే చెప్పాలి. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ముగియ‌డం, అసెంబ్లీ స‌మావేశాలు రేప‌టికి వాయిదా ప‌డిన వెంట‌నే బ‌య‌ట‌కు వ‌చ్చిన అధికార‌, విప‌క్ష పార్టీల స‌భ్యులు సుప్రీంకోర్టు నిర్ణ‌యం తెలుసుకుని ఎవ‌రికి తోచిన విధంగా వారు చ‌ర్చించుకోవ‌డం మొద‌లుపెట్టారు. కేసు ప్రాధాన్యం దృష్ట్యా... దీనిపై అంద‌రి కంటే ముందుగానే స్పందిస్తే బాగుంటుంద‌నుకున్నారో, ఏమో తెలియ‌దు గానీ... చంద్ర‌బాబు నేరుగా మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ కేసును సుప్రీంకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించిన వైనంపై స్పందించారు. ఈ విష‌యంలో ఎలాంటి కొత్తద‌నం ఏమీ లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

*ఈ కేసు కొత్త‌దేమీ కాదుగా. ఈ కేసులోనూ గ‌తంలో కూడా కోర్టులు విచార‌ణ చేశాయి క‌దా. అయినా ఈ కేసులో ఇప్ప‌టికే నాకు చాలా సార్లు నోటీసులు వ‌చ్చాయి. నాపై కేసులు కొత్త కాదుగా. ఇప్ప‌టికే నాపై 26 కేసులు వేశారు. వాటిన్నింటినీ ఎదుర్కొన్నాను. ఏ కేసులోనూ నేను దోషిగా తేల‌లేదు. వారు కేసులు వేస్తూనే ఉంటారు. నేను ఎదుర్కొంటూనే ఉన్నాను. ఇందులో నాకైతే కొత్త విష‌య‌మేమీ క‌నిపించ‌డం లేదు. ఈ కేసులో త‌దుప‌రి చ‌ర్య‌లు ఎలా ఉంటాయో మీరే చూస్తారు క‌దా* అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్య‌లు చేస్తున్న స‌మ‌యంలో చంద్రబాబు ముఖంలో ఆందోళ‌ణ స్ప‌ష్టంగా క‌నిపించింది. అయితే ఆ ఆందోళ‌న‌ను బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా ఉండేందుకు చంద్ర‌బాబు తంటాలు ప‌డిన వైనం కూడా మీడియా కంటికి చిక్కేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/