Begin typing your search above and press return to search.
అమెరికా నుంచి జగన్ పారిపోయి వచ్చాడా?!
By: Tupaki Desk | 1 Sep 2015 7:55 AM GMTఏపీకి ప్రత్యేక హోదా గురించి అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు, జగన్ మధ్య మాటల తూటాలు పేలాయి. ముందుగా జగన్ మాట్లాడుతూ తాము ప్రతి విషయంపై స్టడీ చేసి మాట్లాడతామని..చంద్రబాబు అస్సలు హోం వర్క్ చేయరని..ఆయనకు ఓపిక లేదని..ఆయన ఓ అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని సెటైర్లు వేశారు.
ఇందుకు చంద్రబాబు ధీటుగా స్పందిస్తూ జగన్ ను చదువుకోమని అమెరికా పంపిస్తే అక్కడనుంచి పారిపోయి వచ్చాడని..కాని తన కుమారుడు లోకేష్ ను అమెరికా పంపిస్తే అక్కడ చక్కగా చదువుకుని వచ్చాడని జగన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గతంలో జగన్ తండ్రి వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా తాను ఈ విషయాన్ని ఆయనతో అన్నట్టు గుర్తు చేశారు. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ తాను అవుట్ డేటెడ్ పొలిటిషీయన్ అని విమర్శిస్తున్న జగన్ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే ఐటీ రంగాన్ని ఫస్ట్ ప్రమోట్ చేసిన సీఎం తానేనని..ఇప్పుడు కూడా దాన్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నానని బాబు అన్నారు.
మీలాగా తప్పుడు లెక్కలు రాసుకోవడం తనకు చేతకాదని...విలువలు, సంప్రదాయాలు, క్యారెక్టర్ ఉన్న వ్యక్తులుగా తాము చరిత్రలో నిలుస్తామని..అవినీతి చరిత్ర ఉన్న వ్యక్తులుగా మీరు చరిత్రలో ఉంటారని..జగన్ తనకు తాను మాత్రమే ఫ్రెష్ అని చెప్పుకుంటున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు.