Begin typing your search above and press return to search.
నెల రోజుల్లో కొత్త మంత్రులు..
By: Tupaki Desk | 24 Aug 2016 8:58 AM GMTశాసనసభ వర్షాకాల సమావేశాల తర్వాత ఏపి మంత్రివర్గంలో కొందరికి పదవులు ఊడనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా పనితీరు ప్రదర్శించడంలో విఫలమైన కొందరు మంత్రులపై వేటు తప్పదన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సెప్టెంబర్ 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 20మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరడం - వారిలో ఇద్దరు - ముగ్గురికి మంత్రి పదవులు హామీ ఇవ్వడం - పార్టీ సీనియర్లకు ఈసారి న్యాయం చేయాలని భావించిన బాబు - అసెంబ్లీ సమావేశాల తరువాత విస్తరణకు ముహూర్తం నిర్ణయించినట్లు చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు గత కొద్దినెలల నుంచి మంత్రులు - ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయించి - రేటింగులు ఇస్తున్నారు. రేటింగ్ లు సరిగా రాని మంత్రులపై వేటుపడే అవకాశం ఉందంటున్నారు.
బ్యాడ్ టైం వీరిదే..
రావెల కిశోర్ - శిద్దా రాఘవరావు - పరిటాల సునీత - కొల్లు రవీంద్ర - మృణాళిని - పుల్లారావు వంటి మంత్రుల స్థానాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి ప్రత్తిపాటి భార్య గుంటూరు జిల్లాలో పెత్తనం చేస్తున్నారన్న ఆరోపణలు పెరగడంతో ఆయన పట్లా ఆ వ్యతిరేకత వస్తోందని చంద్రబాబు దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన్ను తప్పించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రావెల కిశోర్ కుమారుడి కారణంగా వివాదాల వల్ల ఆయనకు పదవీ గండం తప్పకపోవచ్చని తెలుస్తోంది. మృణాళిని స్థానంలో ఆమె బావ - పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు అవకాశం దక్కవచ్చంటున్నారు. శిద్దారాఘవరావు జిల్లాలో వర్గాలను సమన్వయం చేయలేకపోతున్నారన్న విమర్శలు చాలాకాలం నుంచి ఉన్నాయి.
వారిని తప్పిస్తే..
శిద్దాను తొలగిస్తే - వైశ్యవర్గానికే చెందిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్యకు అవకాశం దక్కవచ్చంటున్నారు. రావెల స్థానంలో చాలామంది దళితులు పోటీపడుతున్నా ఎస్సీ మహిళా ఎమ్మెల్యేకు అవకాశం లభించవచ్చంటున్నారు. రావెల పనితీరుపై దళితుల్లో కూడా సంతృప్తి కనిపించడం లేదన్న సమాచారం పార్టీ వద్ద ఉందంటున్నారు. ఆయన ఇంచార్జిగా ఉన్న ప్రకాశంలో పార్టీ నేతలు రోడ్డెక్కినా వారిని నియంత్రించడంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. పుల్లారావు కుటుంబసభ్యులపై వస్తున్న ఆరోపణలు చాలాకాలం క్రితమే సీఎం దృష్టికి వెళ్లాయి. ఒకవేళ ఆయనను తొలగిస్తే అదే సామాజికవర్గానికి చెందిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు అవకాశం దక్కవచ్చు. వైసీపీ నుంచి వచ్చిన చాంద్ పాషా - ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ల మధ్య పోటీ కనిపిస్తోంది. ఒకవేళ చాంద్ పాషా ను తీసుకుంటే విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆశలకు గండిపడినట్లే. అదే సమయంలో పయ్యావులకు స్థానం కల్పించాలనుకుంటే పరిటాలను తప్పించాల్సి ఉంటుంది.
శాఖల మార్పు
మంత్రి నారాయణ - గంటా శ్రీనివాసరావు శాఖలను మార్పు చేస్తారని - అచ్చెన్నాయుడుకు ప్రమోషన్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యం దృష్ట్యా ఆయన స్థానంపైనా చర్చ జరుగుతోంది.
రెడ్లకు ప్రాధాన్యమిస్తారా?
కాగా, రెడ్డి సామాజికవర్గానికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అపప్రద తొలగిస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - మోదుగుల వేణుగోపాల్ రెడ్డి - వైసీపీ నుంచి వచ్చిన భూమా నాగిరెడ్డి లేదా కూతురు అఖిలప్రియారెడ్డిలో ఎవరికైనా అవకాశం రావొచ్చని తెలుస్తోంది. కాపుల నుంచి జ్యోతుల నెహ్రు - విజయనగరం నుంచి వెలమ వర్గానికి చెందిన సుజయకృష్ణ రంగారావుకు అవకాశం దక్కవచ్చంటున్నారు. వారిద్దరికీ బాబు హామీ ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు.