Begin typing your search above and press return to search.
ట్వీట్ తో బాబు హ్యాపీ...కంపెనీ తెచ్చిన కేటీఆర్
By: Tupaki Desk | 26 Jan 2018 7:09 AM GMTవరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆసక్తికరమైన పరిణామాలకు వేదికగా మారుతోంది. ఈ కీలక సమావేశం గురించి ప్రపంచ అంతటా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలు, దేశాల ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సు పెట్టుబడులు ఆకర్షించేందుకు అత్యుత్తమ మార్గం. అయితే ఈ సమావేశం ఈ దఫా ప్రత్యేకతను కలిగి ఉంది. అదే తెలంగాణ తరఫున మొదటిసారిగా ఐటీ - పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరవడం. ఏపీ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు - ఆయన తనయుడైన మంత్రి లోకేష్ తరలివెళ్లడం.
తెలుగు రాష్ర్టాలు సహజంగానే అన్ని అంశాల్లో పోటీపడుతున్నట్లుగానే...దావోస్ వేదికగా పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నం చేశాయి. అయితే తాజా భేటీలో మంత్రి కేటీఆర్ పైచేయి సాధించారని అంటున్నారు. అది కూడా కీలక కంపెనీ విషయంలో - పైగా భారతీయ కంపెనీ విషయంలో కావడం గమనార్హం. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా నిర్ణయం గురించి. ఆనంద్ మహీంద్రాను ఇటు సీఎం చంద్రబాబు - అటు కేటీఆర్ కలిశారు. ఈ భేటీ సందర్భంగా తాను సీఎం చంద్రబాబును కలవడం సంతోషకరమని, ఆయన మంచి పరిపాలకుడని ప్రశంసిస్తూ...మహీంద్ర ట్వీట్ చేశారు. సహజంగానే ఈ ట్వీట్ ను టీడీపీ వర్గాలు పెద్ద ఎత్తున షేర్ చేశాయి. తమ నాయకుడి రేంజ్ ఇది అంటూ ఖుష్ అయ్యాయి. అయితే కేటీఆర్ మాత్రం ఇందుకు భిన్నమైన ప్రతిఫలాన్ని ఆనంద్ మహీంద్రా నుంచి పొందడం గమనార్హం.
దావోస్ లో నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక వేదికలో.. ఆనంద్ మహీంద్రాతోపాటు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ- మహీంద్రా సంస్థల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని.. వరంగల్ పట్టణంలో టెక్ మహీంద్రా కార్యకలాపాలు ప్రారంభించాలని ఆనంద్ మహీంద్రా, కంపెనీ సీఈవో సీపీ గుర్నానీని మంత్రి కేటీఆర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలతోపాటు వరంగల్ లో ఉన్న అవకాశాలు - టాలెంట్ పూల్ వంటి అంశాలను మంత్రి వారికి వివరించారు. దీంతో వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చారు. ముందుగా 500 మందితో సెంటర్ నెలకొల్పి, భవిష్యత్ లో విస్తరిస్తామని తెలిపారు. మహీంద్రా సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో రెండోశ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడంలో ప్రేరకంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్న అనంద్ మహీంద్రా - సీపీ గుర్నానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
అంటే, బాబుతో భేటీ అనంతరం ఓ ట్వీట్ లో ఆయన్ను అభినందించిన ఆనంద్ మహీంద్రా....తన కంపెనీనీ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లో తానే ఐటీకి సర్వం అంటూ బాబు ప్రచారం చేసుకుంటుంటే..ఆయనతో భేటీ అయిన వ్యాపారవేత్తను ఒప్పించి మెప్పించి...తెలంగాణకు అందులోనూ హైదరాబాద్ కు కాకుండా..ద్వితీయ శ్రేణి నగరమైన వరంగల్ కు ఐటీ కంపెనీని తీసుకుపోవడంలో కేటీఆర్ విజయం సాధించారని అంటున్నారు.