Begin typing your search above and press return to search.
రామోజీకి పద్మవిభూషణ్ ఇప్పించింది బాబు!
By: Tupaki Desk | 2 July 2017 4:16 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి వచ్చిన మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఆ మధ్యన ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుకు రావటం తెలిసిందే. అయితే.. ఆయనకు ఆ పురస్కారం రావటానికి కారణం తానే అని చెప్పుకున్నారు చంద్రబాబు. రామోజీరావు సేవల్ని గుర్తించి.. ఆయనకు పద్మవిభూషణ్ ఇవ్వాల్సిందిగా తానే సిఫార్సు చేసినట్లుగా బాబు వెల్లడించారు.
కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీ ఫౌండేషన్ అధ్వర్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్ని శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పార్టీ ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తెప్పించుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు.
పని తీరు బాగోపోతే తొలిసారి హెచ్చరిస్తానని.. మారకుంటే వారిపై గట్టిగా చర్యలు ఉంటాయన్న ఆయన.. అధికారులు ఎవరైనా సరే.. సకాలంలో పని చేయకున్నా.. లంచం అడిగినా కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే.. బాధ్యులపై చర్యలు తప్పనిసరి అంటూ స్పష్టం చేశారు. గతంలో సీఎంగా పని చేసినప్పుడు ఆకస్మిక తనిఖీలంటూ తాను ఎక్కడైనా పర్యటిస్తే అధికారులంతా భయపడిపోయే వారని.. కొందరు చేసిన తప్పులకు అందరూ భయపడిపోవాల్సి వస్తోందని భావించి.. తాను ఇప్పుడు ఆ పని చేయటం లేదని చెప్పటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/