Begin typing your search above and press return to search.

ఫ్యూచ‌ర్లో సీబీఐ ఎంక్వ‌యిరీ అడ‌గ‌రా బాబు?

By:  Tupaki Desk   |   20 Jun 2017 5:08 AM GMT
ఫ్యూచ‌ర్లో సీబీఐ ఎంక్వ‌యిరీ అడ‌గ‌రా బాబు?
X
అధికారం చేతిలో ఉన్న‌ప్పుడు చాలా విషయాల్ని ప‌ట్టించుకునే తీరిక ఉండ‌దు. ఇక‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు లాంటి వారి సంగ‌తి అస్స‌లు చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎందుకంటే.. ఆయ‌న సీఎం అయిన నాటి నుంచి మ‌న‌మ‌డితో గ‌డ‌ప‌టానికి కూడా టైం దొర‌క‌ని ప‌రిస్థితి. అంత బిజీబిజీగా ఉండే చంద్ర‌బాబు.. ఈ మ‌ధ్య‌న తాను మాట్లాడే మాట‌ల్ని సైతం ఆలోచించ‌టానికి కూడా టైం లేదేమోన‌న్న‌ట్లుగా క‌నిపిస్తోంది. కీల‌క స్థానాల్లో ఉన్న వ్య‌క్తుల నోటి నుంచి వ‌చ్చే మాట‌లు అప్ప‌టికిప్పుడు మాత్ర‌మే కాదు.. భ‌విష్య‌త్తు మీద కూడా ఎంతో ప్ర‌భావితం చేస్తాయ‌న్న విష‌యాన్ని చంద్ర‌బాబు మ‌ర్చిపోయిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

తాజాగా ఆయ‌న మాట‌లు చూస్తే.. ఇదే విష‌యం అర్థ‌మ‌వుతుంది. విశాఖ భూముల కుంభ‌కోణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ సీఎం.. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై మాట్లాడిన మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. మిత్ర‌ప‌క్షంతో పాటు.. సొంత పార్టీనేత‌లు.. త‌న మంత్రివ‌ర్గంలోని మంత్రి సైతం విశాఖ భూ కుంభ‌కోణం మీద సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేస్తుండ‌గా.. బాబు మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యారు.

సీబీఐ విచార‌ణ‌కు వేస్తే తేల‌టానికి 20 ఏళ్లు ప‌డుతుంద‌ని.. ఆధారాలు ఉంటే తీసుకురావాల‌ని.. మ‌రుస‌టి రోజే చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని చంద్ర‌బాబు చెప్ప‌టం గ‌మ‌నార్హం. విలేక‌రుల‌తో మాట్లాడుతున్న వేళ బాబు నోటి నుంచి వ‌చ్చిన మాట‌కు అక్క‌డి వారు అవాక్కు అయ్యేలా చేసింది. ఇటీవ‌ల కాలంలో సీబీఐ ఎంత యాక్టివ్ గా మారిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలాంటి విచార‌ణ సంస్థ గురించి బాబు అంత తేలిగ్గా మాట్లాడ‌టం ఒక ఎత్తు అయితే.. రేపొద్దున విప‌క్షంలో కూర్చున్న వేళ‌.. ఏదైనా విష‌యం మీద సీబీఐ విచార‌ణ‌కు డిమాండ్ చేసే అవ‌కాశాన్ని తాజా వ్యాఖ్య‌తో బాబు పోగొట్టుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. సీబీఐ విష‌యంలో బాబు తొంద‌రప‌డి మాట్లాడిన‌ట్లు క‌నిపించ‌ట్లేదు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/