Begin typing your search above and press return to search.
కొత్త పథకాలకు చంద్రన్న పేరు లేనట్లే
By: Tupaki Desk | 23 May 2016 6:06 AM GMTఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరుపెట్టడం పట్ల ప్రతిపక్షాలు - వామపక్షాల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో చంద్రబాబు నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారు. ఏ పథకానికీ తన పేరు పెట్టడానికి వీల్లేదని ఆదేశించారు. పథకాలకు తన పేరు పెట్టడంపై మంత్రులపై మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరి ప్రయోజనాలను చేకూర్చాలే తప్పా పేరుపెట్టుకుంటేనో లేక ప్రచారం చేసుకుంటేనో ఫలితం ఉండదని ఆయన హెచ్చరించారు. కాపునాడు భవనానికి చంద్రన్న పేరుపెట్టడం - చంద్రన్న విద్యాదీపం వంటి పథకాలకు పేర్లు పెట్టేముందు సీఎంవో కార్యాలయ అనుమతి తీసుకోకపోవడంపైనా తప్పుపట్టారు.
ముఖ్యంగా సంక్రాంతి కానుక - విద్యాదీపం పథకాలకు చంద్రన్న పేరు పెట్టడంపై విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. అదేసమయంలో కాపు భవనానికి చంద్రన్న అని పేరు పెట్టడంపైనా కాపు నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. తక్షణం ఆ పేరు తొలగించాలని ఆయన డిమాండు చేశారు. చంద్రబాబు బతికుండగానే తన పేర్లు పెట్టుకుంటున్నారంటూ కొందరు వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. అవన్నీ తన వరకు రావడంతో చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. మంత్రులు ఎవరికివారు తమకు నచ్చినట్లుగా చంద్రబాబు పేరు వాడుకుంటుండడంపై ఆగ్రహించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అనుమతి పొందిన తరువాతే పేర్లు పెట్టాలని సూచించారు.
మరోవైపు మినీమహానాడు కార్యక్రమాల్లో టీడీపీ వర్గాల మధ్య గొడవలపైనా చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో జరిగిన మినీమహానాడులో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ - ఆ జిల్లాలో సీనియర్ నాయకుడు కరణం బలరామ్ వర్గీయుల మధ్య ఘర్షణను చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. చిత్తూరు మహానాడు ఏర్పాట్లలో కొద్దిమేర స్థానిక నాయకుల మధ్య వ్యత్యాసాలు రావడం, రాజమండ్రిలో నాయకుల మధ్య వర్గపోరుపైనా ఆరా తీస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో టీడీపీ నేతల కొట్లాటను ఆయన తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. వీటిపై ఆయా జిల్లాలకు ఇన్ ఛార్జ్ లుగా ఉన్న మంత్రులకు పూర్తిస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుని తనకు చెప్పాల్సిన బాధ్యతను అప్పగించారు.