Begin typing your search above and press return to search.

ఢిల్లీలో రేవంత్‌ ను క‌లిసేందుకు బాబు`నో`

By:  Tupaki Desk   |   18 Oct 2017 7:00 AM GMT
ఢిల్లీలో రేవంత్‌ ను క‌లిసేందుకు బాబు`నో`
X
తెలుగుదేశం పార్టీలో ప‌రిణామాలు రస‌వ‌త్తరంగా మారుతున్నాయి. తెలంగాణ‌ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగ‌డం...అది తెలుగుదేశం వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేకెత్తించ‌డం తెలిసిన సంగ‌తే. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత‌ - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును క‌లిసేందుకు రేవంత్ ప్ర‌య‌త్నించారు. అయితే రేవంత్‌ కు అపాయింట్‌ మెంట్ ఇచ్చేందుకు చంద్ర‌బాబు నిరాకరించారు. దీంతో ఈ ప‌రిణామం టీడీపీలో హాట్ టాపిక్‌ గా మారింది.

విదేశీ పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబును కలిసేందుకు దేశ‌రాజ‌ధానిలోనే ఉన్న రేవంత్‌ రెడ్డి అప్పాయింట్‌ మెంట్‌ కోరగా టీడీపీ అధినేత అపాయింట్‌ మెంట్‌ ఇవ్వడానికి నిరాకరించారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరతారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు రెవంత్‌ రెడ్డిని కలవడానికి నిరాకరించారన్న సమాచారం ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.

ఇదిలాఉండ‌గా..రేవంత్‌ రెడ్డితో టీడీపీ సీనియర్‌ నేత - మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ ఢిల్లీలో భేటీ అయ్యారు. తాజా పరిస్థితిపై కంభంపాటి రేవంత్‌ రెడ్డితో చర్చిస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మ‌రోవైపు తాను రాహుల్‌ గాంధీని కలవలేదని రేవంత్‌ రెడ్డి చెప్తున్నారు. టీఆర్‌ ఎస్‌ పార్టీ బంగారు కూలీ పేరుతో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించిందని - ఇది ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంటూ టీఆర్‌ ఎస్‌ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని - సుప్రీమ్ కోర్ట్ లో కేసు వేసేందుకు న్యాయవాదులతో మాట్లాడేందుకు రాజ‌ధానికి వచ్చానని వివ‌ర‌ణ ఇస్తున్నారు.