Begin typing your search above and press return to search.
బాబు బంధువులందరికీ రుణమాఫీ అయ్యిందా?
By: Tupaki Desk | 4 Jan 2016 7:24 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని, ఆయన చేపట్టిన రుణమాఫీని విమర్శించేవారికి కొత్త అస్త్రం ఒకటి దొరికింది. రుణమాఫీ సక్రమంగా చేయలేదని... ఎంతోమంది అర్హులు మిగిలిపోయారని విపక్ష వైసీపీ చేస్తున్న ఆరోపణలకు మద్తతుగా ఉండేలాంటి సంఘటన ఒకటి జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలోనే... చంద్రబాబుకు బంధువయ్యే రైతుకే రుణమాఫీ జరగలేదట. దీంతో ఆయన అధికారులను నిలదీశారట.
చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలోని ఆయన సమీప బంధువుకే రుణమాఫీ కాకపోవడంతో నారావారిపల్లెలో ఆదివారం నాడు అధికారులకు చుక్కెదురైంది. రుణమాఫీ పైన చంద్రబాబు సమీప బంధువు ఒకరు అధికారులను నిలదీసినట్లుగా తెలుస్తోంది. నారావారిపల్లెలో జన్మభూమి-మన ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు అధికారులు వచ్చారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు సమీప బంధువు నాగరాజు నాయుడు హాజరయ్యారు. ఆయన రుణమాఫీ పైన అధికారులను నిలదీశారని తెలుస్తోంది. తనకు రూ.40 వేల అప్పు ఉంటే ఒక్కరూపాయి కూడా మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.