Begin typing your search above and press return to search.
మెగా ఫ్యామిలీ సంస్థకు చంద్రబాబు గిఫ్ట్..!
By: Tupaki Desk | 27 Oct 2016 10:51 AM GMTముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విమానాలంటే చాలాచాలా ఇష్టం అని చెప్పుకుంటూ ఉంటారు. ఏ దేశానికి వెళ్లినా... ముందుగా అక్కడున్న విమానాశ్రయాలను చూస్తుంటారు. అక్కడి నుంచీ ఆంధ్రాకి సర్వీసులు నడపడం సాధ్యమా అని ఆలోచిస్తుంటారు. సరే, అదే తరహాలో ఆంధ్రాలో కూడా విమాన సర్వీసుల రద్దీ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. ఏ రేంజిలో అంటే... సదరు సర్వీసుల వల్ల విమానయాన సంస్థలకు నష్టాలు వచ్చినా కూడా ఏపీ సర్కారే వాటిని భరించే స్థాయిలో అన్నమాట! ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ డైరెక్టర్ గా ఉన్న ట్రూజెట్ సంస్థకు చెందిన టర్బో మెగా ఎయిర్ వేస్ కు రూ. 4.90 కోట్లు మంజూరు చేస్తూ చంద్రబాబు సర్కారు ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ, ఈ నిధులు ఎందుకు మంజూరు చేశారంటే... సదరు సంస్థ విజయవాడ-కడప - తిరుపతి-విజయవాడల మధ్య విమాన సర్వీసులు నడిపినందుకు! ప్రయాణికుల రద్దీ - డిమాండ్ లేకపోయినా కూడా విమానాలు నడిపినందుకుగానూ ఆ నష్టాన్ని ఏపీ ప్రభుత్వం భరిస్తూ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) పథకం కింద నిధులను మంజూరు చేసినట్టు ప్రకటించారు. విజయవాడ నుంచి తిరుపతి - కడపలకు విమానాలు నడిపే టెండర్లను ట్రూజెట్ గతంలో సొంతం చేసుకుంది. ప్రయాణికులు ఉన్నా లేకపోయినా, సీట్లు ఫిల్ అయినా కాకపోయినా... వారంలో నాలుగు రోజులు విమానాలను విధిగా ఈ పట్టణాల మధ్య నడపాల్సి ఉంటుంది.
ఆ ఒప్పందం ప్రకారం 72 సీట్ల సామర్థ్యం కలిగిన విమానాలను ట్రూజెట్ నడుపుతోంది. ప్రతీ సర్వీసులోనూ ప్రభుత్వానికి 5 సీట్లను ట్రూజెట్ ఇస్తుంది. ఏడాది కాలంలో 672 సర్వీసులు ట్రూజెట్ నడిపింది. దానిలో సగం... అంటే, ఆర్నెల్లకుగానూ రూ. 4.90 కోట్లను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా ఒక జీవో విడుదల చేస్తూ సదరు చెల్లింపుల్ని చంద్రబాబు పూర్తి చేశారన్నమాట!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/