Begin typing your search above and press return to search.

చ‌రిత్ర‌లో నిలిచిన చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   16 Sep 2015 12:21 PM GMT
చ‌రిత్ర‌లో నిలిచిన చంద్ర‌బాబు
X
ఏపిలో తాము చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో ప‌ట్టిసీమ ప్రాజెక్టు కంప్లీట్ చేయ‌డం తొలి విజ‌య‌మ‌ని ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. బుధ‌వారం ఆయ‌న గోదావ‌రి - కృష్ణా న‌దుల అనుసంధానాన్ని కృష్ణా జిల్లా విజ‌య‌వాడ స‌మీపంలోని ఫెర్రీ వ‌ద్ద నిర్వ‌హించారు. అనంత‌రం ఆయ‌న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ప‌ట్టిసీమ చేరుకుని అక్క‌డ ప‌ట్టిసీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం తొలి పంప్‌ను ప్రారంభించారు. ముందుగా విజ‌య‌వాడ స‌మీపంలోని ఫెర్రీలో కృష్ణా-గోదావరి సంగమ ప్రదేశంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఫెర్రీ వ‌ద్ద గోదావ‌రి జ‌లాల‌ను ఆయ‌న కృష్ణాలో క‌లిపారు. వేద మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య వైభ‌వంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని తిల‌కించేందుకు వేలాదిమంది ప్ర‌జ‌లు త‌రలి వ‌చ్చారు.

కృష్ణా న‌దికి హార‌తి అనంత‌రం గోమాత పూజ‌లో కూడా ఆయ‌న పాల్గొన్నారు. కృష్ణాన‌ది వ‌ద్ద దుర్గ‌మ్మ ఆల‌య న‌మూనాలో క‌ల‌శ పూజ‌లో కూడా బాబు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్ర‌బాబు మాట్లాడుతూ ఈ ప్ర‌పంచంలో డ‌బ్బు కంటే నీరు ఎంతో విలువైంద‌ని...నీరు లేక‌పోతే మాన‌వ మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌ని పేర్కొన్నారు.

ఈ రోజు త‌న జీవితంలో ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేన‌ని... త‌న జన్మ చరితార్థమైందని సీఎం తెలిపారు. ఏపీలో క‌రువు ప్రాంత‌మైన రాయ‌ల‌సీమ‌కు కృష్ణా జలాలు త‌ర‌లించి...ఏపీ నుంచి క‌రువును శాశ్వ‌తంగా పారద్రోల‌డ‌మే త‌న ధ్యేయ‌మ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. భ‌విష్య‌త్తులో ఏపీని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌ గా తీర్చిదిద్దుతాన‌ని చెప్పారు. రాష్ర్టంలో నీటి వినియోగంపై ప్ర‌తి సంవ‌త్స‌రం ఆడిట్ చేస్తామ‌ని...వ‌ర్ష‌పు నీటిని సంర‌క్షించుకోవాల‌నే అంశంపై ప్ర‌తి ఒక్క‌రు ఆలోచించాల‌న్నారు.

గోదావరి పుష్కరాల కంటే ఘనంగా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఫెర్రీ నుంచి ప‌ట్టిసీమ‌కు చేరుకున్న చంద్ర‌బాబు అక్క‌డ ప‌ట్టిసీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం తొలి పంపును ప్రారంభించాక మీడియాతో మాట్లాడారు. ఈ రోజు త‌న జీవింతో మ‌ర్చిపోలేన‌ని... మంత్రులు, ఎమ్మెల్యేల స‌హ‌కారంతో తాను త‌క్కువ టైంలో గోదావ‌రి-కృష్ణా న‌దుల అనుసంధానాన్ని పూర్తి చేశాన‌ని చెప్పారు.