Begin typing your search above and press return to search.

ఆదికి క‌డ‌పే!... టీడీపీ ఫ‌స్ట్ లిస్ట్ ఇదిగో!

By:  Tupaki Desk   |   21 Feb 2019 1:41 PM GMT
ఆదికి క‌డ‌పే!... టీడీపీ ఫ‌స్ట్ లిస్ట్ ఇదిగో!
X
ముందుగా ప్ర‌క‌టించిన‌ట్టుగానే ఏపీలో అధికార పార్టీ టీడీపీ ఎన్నిక‌ల‌కు చాలా స‌మ‌యం ఉండ‌గానే త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేస్తోంది. అధికారికంగా ఈ ప్ర‌క‌ట‌న‌కు కాస్తంత టైమ్ ప‌ట్టినా... పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశాల్లో ఆయా నేత‌ల‌కు పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు టికెట్ల కేటాయింపు అంశంపై క్లారిటీ ఇచ్చేస్తున్నారు. నిన్న‌ - ఈ రోజు జ‌రిగిన టెలీ కాన్ఫ‌రెన్స్ సంద‌ర్భంగా ప‌లువురు అభ్య‌ర్థుల పేర్ల‌ను ఖ‌రారు చేసిన చంద్ర‌బాబు... ఇప్ప‌టిదాకా రాష్ట్రంలోని మొత్తం 25 పార్ల‌మెంట్లు సీట్ల‌కు గాను 8 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌గా - మొత్తం 175 అసెంబ్లీ స్థానాల‌కు గాను ఇప్ప‌టిదాకా 72 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ఫైన‌లైజ్ చేశారు.

పార్ల‌మెంటు అభ్యర్థుల విషయానికి వ‌స్తే... క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు పంచాయ‌తీ తీర్మానంలో భాగంగా మంత్రి ఆదినారార‌ణ రెడ్డికి క‌డ‌ప సీటును కేటాయించారు. ఆ పొరుగునే ఉన్న క‌ర్నూలు జిల్లా నంద్యాల సీటుకు సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీ‌ధ‌ర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఇక గుంటూరు సీటును గ‌ల్లా జ‌య‌దేవ్‌ - విజ‌య‌వాడ సీటును కేశినేని నాని - బాప‌ట్ల సీటును శ్రీ‌రామ్ మాల్యాద్రిని ఎంపిక చేసిన చంద్ర‌బాబు... శ్రీ‌కాకుళానికి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు - విజ‌య‌న‌గ‌రానికి అశోక్ గ‌జ‌ప‌తి రాజుల‌ను ఎంపిక చేశారు. ఇక ఇటీవ‌లే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన పండుల ర‌వీంద్ర స్థానం అమ‌లాపురానికి దివంగ‌త నేత జీఎంసీ బాల‌యోగి కుమారుడు జీఎంసీ హ‌రీశ్ ను ఎంపిక చేస్తూ చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇక అసెంబ్లీ సీట్ల విష‌యానికి వ‌స్తే... పూర్తి డేటా బ‌య‌ట‌కు రాకున్నా.. కొన్ని కీల‌క స్థానాల‌కు ఎంపిక చేసిన అభ్య‌ర్థుల వివ‌రాలు ఈ కింది విధంగా ఉన్నాయి. రాయ‌చోటికి ర‌మేశ్ రెడ్డి - రాజంపేట‌కు చెంగ‌ల్ రాయుడు - మైదుకూరుకు డీఎల్ రవీంద్రారెడ్డి - జ‌మ్మ‌ల‌మ‌డుగుకు రామ‌సుబ్బారెడ్డి - ఉర‌వ‌కొండ‌కు ప‌య్యావుల కేశ‌వ్‌ - హిందూపూర్‌ కు నంద‌మూరి బాల‌కృష్ణ‌ - ప‌త్తికొండ‌కు కేఈ కృష్ణ‌మూర్తి - ఆళ్ల‌గ‌డ్డ‌కు అఖిల‌ప్రియ‌ - నంద్యాల‌కు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి - ఆదోనికి మీనాక్షి నాయుడుల‌ను ఎంపిక చేసిన చంద్ర‌బాబు తాను మాత్రం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం నుంచే పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ట్టుగా స‌మాచారం. ఇక మ‌రికొన్ని పేర్ల విష‌యానికి వ‌స్తే... న‌ల్లాకి కిశోర్ కుమార్ రెడ్డికి పీలేరు - గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు కుమారుడికి న‌గ‌రి - బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి కుమారుడికి శ్రీ‌కాళ‌హ‌స్తి - మంత్రి నారాయ‌ణ‌కు నెల్లూరు - బొల్లినేని కృష్ణ‌య్య‌కు ఆత్మ‌కూరు - జ్యోతుల నెహ్రూకు జ‌గ్గంపేట‌ - కొండ్రు ముర‌ళికి రాజాం సీట్ల‌ను కేటాయించిన‌ట్లుగా తెలుస్తోంది.