Begin typing your search above and press return to search.
ఫోటో రచ్చ పెద్దదవుతోంది బాబు..!
By: Tupaki Desk | 31 July 2015 8:49 AM GMTఅనవసరపు తలనొప్పులు తెచ్చుకోవటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారు. బండి మామూలుగా నడవటం ఇష్టం ఉండదేమో కానీ.. ఆయన కదిలించి మరీ కయ్యం పెట్టుకుంటారు. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఏదైనా చేయాలనుకుంటే నొప్పి కలగకుండా.. కూసాలు కదిలేలా చేయాలి. అదెలా అంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి.
అంతేకానీ.. ఫోటోల పంచాయితీల పెట్టుకోవటం ఏమాత్రం మంచిది కాదు. ఒకవేళ ఫోటోలు తీయాలంటే దానికి బలమైన వాదన ఉండాలి. భావోద్వేగాల్ని రగిల్చేదిగా ఉండాలే తప్పించి.. వైఎస్ లాంటి ప్రజాదరణ ఉన్న నేత విషయంలో చేయకూడదు.
ఇప్పుడున్న పరిస్థితికి చంద్రబాబు సర్కారుకు ముందుకు.. వెనక్కి వెళ్లలేని పరిస్థితి. తీయించిన ఫోటోను పెట్టిస్తే.. అది విపక్ష విజయంగా.. అధికారపక్ష ఓటమిగా మారుతుంది. అలా అని.. పెట్టకుండా ఉంటే.. విపక్షం ఊరుకునే పరిస్థితి ఉండదు. వరుస ఆందోళనలు చేస్తూ అధికారపక్షం వైఖరిని ఎండగడుతూ ఉంటుంది.
విపక్షాల్ని దెబ్బ తీయటం అంటే.. విపక్షాలకు చెందిన నేతల ఫోటోలు అసెంబ్లీ నుంచి తీయించటం కాదన్న సంగతి బాబు ఎందుకు మర్చిపోతున్నారు. విపక్ష నేతల్ని దెబ్బ తీయటం అంటే.. వారు వేలెత్తి చూపించలేనట్లుగా వ్యవహరించటం. ఆ చిన్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకో మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది.
తాజాగా ఏపీ శాసన సభ లాంజ్‌లో ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫోటోను తొలగించటం సరికాదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఇలాంటివి రోజురోజుకీ మరింత పెరుగుతాయే తప్పించి తగ్గవు. అందుకే అర్థం లేని విషయాల్లో కాస్త వెనక్కి తగ్గి హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.