Begin typing your search above and press return to search.
జగన్ ను సభ నుంచి బహిష్కరిద్దాం
By: Tupaki Desk | 23 March 2017 11:30 AM GMTఅగ్రిగోల్డ్ భూముల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకింత ఘాటుగా రియాక్టయ్యారు. మంత్రి పుల్లారావు భూముల కొనుగోళ్లపై ఎలాంటి విచారణకైనా సిద్దమని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ అక్రమాల్లో మంత్రి పుల్లారావుది తప్పని తేలితే ఆయనను సభ నుంచి బహిష్కరిద్దామని పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలని తేలితే వైఎస్ జగన్ ను సభ నుంచి బహిష్కరిద్దామని తెలిపారు. సభలో జగన్ లేదా పుల్లారావు ఎవరో ఒకరు ఉండాలని అన్నారు. ఈ అంశంపై జుడిషియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
ఈ అంశం గురించి సీఎం చంద్రబాబు మరింత వివరణ ఇస్తూ అగ్రిగోల్డ్ లో నిందితులుగా ఉన్న మిగతావారిని వెంటనే అరెస్ట్ చేయాలని కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను కోరామని తెలిపారు. అగ్రిగోల్డ్ అంశాన్ని ఆయన శాసనసభలో ప్రస్తావిస్తూ ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి సమాచారం అందించిన వారికి రూ. 10 లక్షల పారితోషికం ప్రకటించమని సీబీసీఐడీని కోరామని తెలిపారు. ఆర్థిక నేరాల విచారణకు ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.
మరోవైపు శాసనసభా వ్యవహారల మంత్రి యనమల రామకృష్ణుడు సైతం జగన్ ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రి పుల్లారావు సవాలును అంగీకరించకపోతే జగన్ తప్పు చేసినట్లే అవుతుందని యనమల వ్యాఖ్యానించారు. మంత్రిపై సభాసంఘం వేసి, ఆయనపై జగన్ చేసిన ఆరోపణలు తప్పని నిర్థారణ అయితే జగన్ సభలో ఉండటానికి వీల్లేదన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/