Begin typing your search above and press return to search.

బాబులో కూల్ మిస్.. జర్నలిస్టులపై ప్రతాపం ఏంది?

By:  Tupaki Desk   |   13 April 2019 5:15 AM GMT
బాబులో కూల్ మిస్.. జర్నలిస్టులపై ప్రతాపం ఏంది?
X
అన్ని రోజులు ఒకలా ఉండవు. అందరూ ఒకే తీరులో ఉండరు. అలా అని ఎవరినో చూపించి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఇప్పుడు విస్మయానికి గురి చేస్తుంది. జర్నలిస్టులకు.. మీడియాకు మిత్రుడిగా పేరున్న ఆయన తాజా వైఖరి అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. బాబు నోటి నుంచి వస్తున్న తేడా మాటలు.. ఆయన్ను ఓటమి భయం వెంటాడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎన్నికల ముగిసిన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టటం తప్పేం కాకున్నా.. మీడియాతో ముక్తసరిగా మాట్లాడి బై చెబితే సరిపోతుంది. అందుకు భిన్నంగా సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన్ను.. ప్రశ్నలు వేయటం తప్పేం కాదు. కానీ.. ప్రశ్నకు సమాధానం చెప్పే రీతిలో ఉండాలే కానీ.. అందుకు భిన్నమైన వైఖరి ఏ మాత్రం మంచిది కాదు.

ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పాలి. ఎవరి పేరునైనా చెప్పిన వెంటనే.. వారికంటూ ఒక ఇమేజ్ ఉంటుంది. మొదట్నించి ఒకలా ఉండి.. సడన్ గా మారిపోవటాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతి చూసుకోండి. మీడియాతో ఫ్రెండ్లీగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ.. వారి నోటి నుంచి క్వశ్చన్లు రాకూడదు. వస్తే.. తనదైన శైలిలో సెంటిమెంట్ ను రంగరించి.. ఎటకారం చేసేసి.. తన తోటి జర్నలిస్టుల ముందు ఇజ్జత్ తీసేస్తారు. ఆ సమయంలో తెలివిగా తన చుట్టూ ఉన్న జర్నలిస్టుల నైతిక మద్ధతును తీసుకుంటూ మైండ్ గేమ్ మాదిరిగా మీడియా మీట్ పెడతారు.

ఏళ్లకు ఏళ్లుగా అలవాటు కావటం.. సెంటిమెంట్ ను రగిలించే అధినేత కావటంతో పాటు.. మీడియా యాజమాన్యాలతో కేసీఆర్ కు ఉండే ప్రత్యేకమైన లింకు నేపథ్యంలో ఆయన్ను ప్రశ్నించే విషయంలో జర్నలిస్టులు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. కొందరు ఇవేమీ పట్టించుకోకుండా ప్రశ్నిస్తారు కానీ.. కేసీఆర్ వాటికి సమాధానం ఇచ్చే విషయంలో నేర్పుగా వ్యవహరించి ఇరుకున పడేసేలా మాట్లాడుతుంటారు. దీంతో.. ప్రశ్న అడిగి మరీ మాట అనిపించుకోవటం ఎందుకన్నట్లుగా వ్యవహరిస్తుంటారు జర్నలిస్టులు.

ఇలాంటి నేర్పు అందరికి సాధ్యం కాదు. చంద్రబాబుకు అస్సలు రాదు. అలాంటప్పుడు తన స్టైల్ కు తగ్గట్లే బాబు ఉండాలే కానీ.. కేసీఆర్ మాదిరో.. మరో నేత మాదిరో ఉండటం అస్సలు బాగోదు. తాజాగా ముగిసిన ఎన్నికలకు సంబంధించి అంతర్గత రిపోర్టులు బాబును బ్యాలెన్స్ మిస్ అయ్యేలా చేస్తుందో ఏమో కానీ.. ఒకప్రశ్నకు బదులిచ్చే క్రమంలో తన డీసెన్సీని మిస్ అయ్యారు బాబు.

ఒక మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మోడీని చూస్తే ఉచ్చపోసుకుంటారు.. కేసీఆర్ ను చూస్తే మీకు భయం.. తెలియకుండానే ఫ్యాంట్ తడిసిపోతుందంటూ అంటూ నానా మాటలు అనేశారు. ఇలాంటి మాటలు మాట్లాడటం తన ఇమేజ్ కు ఎంతమాత్రం గౌరవప్రదం కాదన్న విషయాన్ని ఆయన మిస్ కావటం ఆశ్చర్యంగా మారింది. అసలు జగన్ ఎవరు? ఆయనేం సాధించారు? మీరెందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు? ఆయన మాటలకు నేనెందుకు జవాబులు ఇవ్వాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాబును చూసినప్పడు కొన్ని సందేహాలు రాక మానవు.

సార్.. మాతో మాట్లాడాలని మేం కోరామా? మీడియా మీట్ పెట్టండని అడిగామా? మీకు మీరుగా మీడియా మీట్ అని పిలిచి.. మీరు అడగండి.. నేను బదులిస్తా అన్నప్పుడు.. ప్రశ్నించటం తప్పు కాదు కదా? సమాధానం చెప్పలేకపోతే.. అందుకు తగ్గట్లు మాట్లాడాలి. కాదూ కుదరదంటే.. తెలివిగా మాట్లాడుతూ ప్రశ్నించిన వారు ఇరుకున పెట్టే నేర్పు ఉండాలి. అంతేకానీ.. ఫ్యాంట్లు తడిపేసుకోవటం.. ఉచ్చలు పోసుకోవటం లాంటి మాటలు మీ స్ట్రేచర్ కు సూట్ కావు బాబుగారు?