Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను బాబు కోరిన మూడు కోర్కెలు?

By:  Tupaki Desk   |   19 Oct 2015 6:02 AM GMT
కేసీఆర్ ను బాబు కోరిన మూడు కోర్కెలు?
X
ఉప్పు.. నిప్పులా ఉండే ఇద్దరు చంద్రుళ్లు కలిశారు. మాట్లాడుకున్నారు. ఏకాంతంగా భేటీ అయ్యారు. అమరావతి శంకుస్థాపనకు తప్పనిసరిగా రావాలని చాలా గట్టిగా కేసీఆర్ ను ఆహ్వానించారు. చంద్రబాబు ఆహ్వానానికి మనస్ఫూర్తిగా ఒప్పుకోవటమే కాదు.. అంతలా అడగాలా? తప్పనిసరిగా వస్తానన్న మాటను తనదైన శైలిలో కేసీఆర్ స్పష్టంగా చెప్పారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నోటి నుంచి మూడు కోర్కెలు వచ్చినట్లుగా చెప్పొచ్చు. ఏకాంతంగా ఎన్ని కోర్కెలు కోరారో కానీ.. అందరూ ఉన్నప్పుడు మాత్రం మూడు రిక్వెస్ట్ లను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేయటం.. వాటికి కేసీఆర్ ఓకే చెప్పేయటం గమనార్హం.

ఇంతకీ.. కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన మూడు కోర్కెలు చూస్తే.. అందులో మొదటిది.. అమరావతి శంకుస్థాపనకు రావాలని కోరటం.. రెండోది.. శంకుస్థాపనకు రావటమే కాదు.. భోజనం చేసి వెళ్లాలన్న మాటను చెప్పటమే కాదు.. ఆ రోజు ప్రధాని మోడీతో కలిసి తాను తిరుమల వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో.. తాను దగ్గర ఉండనని.. మరోలా అనుకోవద్దన్న మాటను ముందే చెప్పటం ద్వారా.. కేసీఆర్ మనసును ఎక్కడా నొప్పించకూడదన్న భావనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంటికి వచ్చే అతిధికి మర్యాద చేయటంలో ఎక్కడా లోపం రాకూడదని.. అలాంటిది జరిగితే.. చెడ్డపేరు పక్కా అన్న విషయాన్నిచంద్రబాబు మర్చిపోలేదని చెప్పాలి. ఇక.. మూడో కోరికగా.. తెలంగాణ నుంచి మట్టిని.. నీటిని సీఎం కేసీఆర్ తనతో పాటు తీసుకురావాలన్న కోరికను కేసీఆర్ ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. మొత్తమ్మీదా నిన్నటి వరకూ ఇద్దరు అధినేతల మధ్యనున్న ఘర్షణ పూరిత వాతావరణం సమిసిపోయి.. చివరకు సహృద్భావ వాతావరణంలో మాట్లాడుకోవటం మంచి పరిణామమే.