Begin typing your search above and press return to search.
సంక్రాంతికి వస్తే రుణం తీర్చుకున్నట్లా..?
By: Tupaki Desk | 17 Jan 2016 6:30 AM GMTకొందరి నేతలు చెప్పే మాటలు కాస్తంత చిత్రంగా ఉంటాయి. ఏదో భావోద్వేగంతో రెండు మాటలు చెప్పే కన్నా.. తాను ఇచ్చే పిలుపు ఎంతో కొంత అర్థవంతంగా ఉండాలన్న ఆలోచన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో ఉన్నట్లు అస్సలు కనిపించదు. సంక్రాంతి సందర్భంగా తన స్వగ్రామమైన చిత్తూరుజిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నారావారి పల్లెలో సకుటుంబ సమేతంగా గడిపారు.
ఈ సందర్భంగా విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులకు సరికొత్త పిలుపునిచ్చారు. పట్టణాలు.. నగరాల్లో స్థిరపడిన వారంతా సంక్రాంతి పండక్కి ఊళ్లకు వెళుతున్నట్లే.. విదేశాల్లో స్థిరపడిన ఆంధ్రులు సంక్రాంతి పండగ సందర్భంగా జన్మభూమి బాట పట్టాలని.. ఈ పండక్కి తమ స్వగ్రామాలకు రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
విదేశాల్లో స్థిరపడిన వారు తమ స్వగ్రామాలకు ఏదైనా కాస్త మేలు చేసి జన్మభూమి రుణం తీర్చుకోవాలన్న పిలుపునిచ్చారు. చంద్రబాబుపిలుపు బాగానే ఉంది కానీ.. సంక్రాంతి పండక్కి ఎన్ ఆర్ ఐలు తమ మాతృభూమికి వచ్చి వెళ్లేందుకు వీలుగా ఏదైనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది కానీ.. సంక్రాంతికి రావాలన్న ఉత్త పిలుపుతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. విదేశాల్లో ఉన్న వారు ఊళ్లకు వచ్చి వెళ్లటం ఆర్థికంగా ఎంతో భారమన్న విషయాన్ని బాబుగారు మర్చిపోతే ఎట్లా..?