Begin typing your search above and press return to search.

విశాఖ‌లో పెయిడ్ ఆర్టిస్టులు - అమ‌రావ‌తిలో శుద్ధ‌పూస‌లు..ఇదేనా ప‌చ్చ‌నీతి?

By:  Tupaki Desk   |   27 Feb 2020 2:30 PM GMT
విశాఖ‌లో పెయిడ్ ఆర్టిస్టులు - అమ‌రావ‌తిలో శుద్ధ‌పూస‌లు..ఇదేనా ప‌చ్చ‌నీతి?
X
అమ‌రావ‌తి ప్రాంతంలో ఆందోన‌లు కొన‌సాగుతూ ఉన్నాయి. అక్క‌డ మంత్రులు - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు - ఎంపీలు - ఎమ్మెల్యేలు దొరికిన‌ప్పుడు వారిపై దాడులు చేయ‌డానికి కూడా ఆందోళ‌న కారులు వెనుకాడ‌టం లేదు. ఇప్ప‌టికే ఈ దాడుల‌ను ఎదుర్కొన్న వారిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - విప్ పిన్నెళ్లి రామ‌కృష్ణా రెడ్డి - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సురేష్ మీద అయితే రెండు సార్లు అటాక్ జ‌రిగింది. ఇక ఆర్కే రోజా మీద కూడా అమరావతి ఆందోళ‌న కారులు దాడికి పాల్ప‌డ్డారు. వారి కాన్వాయ్ ల మీద‌ - వారి వాహ‌నాల మీద రాళ్లు వేయ‌డం - చుట్టుముట్టి కొట్టినంత ప‌ని చేయ‌డం అమరావ‌తిలో జ‌రిగాయి!

అమ‌రావ‌తి ఆందోళ‌న‌ల‌కు తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిందో అంద‌రికీ తెలిసిందే. అమ‌రావ‌తి ఆందోళ‌న‌ల కోసం చంద్ర‌బాబు నాయుడు నిధుల సేక‌ర‌ణ కూడా చేశారు. జోలె ప‌ట్టి డ‌బ్బులు సేక‌రించారు. అలా అమ‌రావ‌తి ఆందోళ‌న‌ల‌కు చంద్ర‌బాబు నాయుడి డైరెక్ట్ స్పాన్స‌ర్ షిప్ ఉంది. ఇక మూడు గ్రామాల్లో గ‌ట్టిగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో ఏకంగా మంత్రుల మీద‌ - ఎంపీల మీద - అధికార పార్టీ నేత‌ల మీద డైరెక్ట్ అటాక్ లు జ‌రిగాయి.

వారి కార్ల మీదకు రాళ్లు వేయ‌డం - కారం కొట్ట‌డం - డైరెక్టుగా వ్య‌క్తుల మీద‌కు దాడి చేయ‌డం. ఇవ‌న్నీ అమ‌రావ‌తిలో జ‌రిగాయి - జ‌రుగుతున్నాయి! అక్క‌డ‌కూ మంత్రులు - ఎమ్మెల్యేలు ఎవ‌రూ ఆందోళ‌న ప్రాంతాల‌కు వెళ్ల‌కూడ‌ద‌న్న‌ట్టుగా మారింది ప‌రిస్థితి! అయితే ఆ ఆందోళ‌న‌ల‌ను తెలుగుదేశం పార్టీ స‌మ‌ర్థిస్తూ ఉంది. అక్క‌డ అధికార పార్టీ నేత‌ల మీద దాడి జ‌రిగితే.. అది ఆందోళ‌న‌లో భాగం అయిపోతోంది. తెలుగుదేశం పార్టీ - ఆ పార్టీ అనుకూల మీడియా అలాంటి ఘ‌ట‌న‌ల‌ను అందంగా స‌మ‌ర్థిస్తూ ఉంది.

క‌ట్ చేస్తే.. విశాఖ‌లో చంద్ర‌బాబు నాయుడిని అడ్డుకోవ‌డం వెనుక మాత్రం విద్రోహం కనిపిస్తూ ఉంది. వాస్త‌వానికి చంద్ర‌బాబు నాయుడు మీద దాడి జ‌ర‌గ‌లేదు. ఆయ‌నను అడ్డుకున్నారంతే. అయితే ఆందోళ‌న కారులు అలా చేశారు, ఇలా చేశారు అని అంటున్నారు. ఆ పై వారంతా డ‌బ్బులు తీసుకున్న జ‌నాలు అని ముద్ర వేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. స్వ‌యంగా చంద్ర‌బాబునాయుడే ఆ మాట‌ల‌న్నారు. డ‌బ్బులిచ్చి మ‌నుషుల‌ను తెచ్చారంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు.

మ‌రి అమ‌రావ‌తిలో డైరెక్టుగా మంత్రుల మీద‌ - ఎంపీల మీద అటాక్ జ‌రిగితే.. అది మాత్రం ఆందోళ‌న‌ - అదే చంద్ర‌బాబు నాయుడిని అడ్డుకుంటే మాత్రం అది డ‌బ్బులు తీసుకుని చేసిన ప‌ని. ఇదేనా ప‌చ్చ‌నీతి?