Begin typing your search above and press return to search.
పరువంతా పోయాక నిద్ర లేచిన బాబు!
By: Tupaki Desk | 15 July 2019 9:41 AM GMTమీ ఇంట్లో వాళ్లు.. మీ కళ్ల ఎదుటే కొట్టుకుంటున్నారనుకోండి? మీరేం చేస్తారు? గుడ్లు అప్పగించి చూస్తుంటారా? లేక.. కొట్టుకోనివ్వు అని వదిలేస్తారా? రోజూ కొట్టుకునే వాళ్లు అయితే.. సర్లే పొనిద్దు అని వదిలేయొచ్చు. ఇల్లు దాటి రోడ్డు మీదకు వెళ్లి తగులాడుకుంటుంటే ఇక మీరు ఊరుకుంటారా? ఛాన్సే ఇవ్వరు కదా. కావాలంటే మీరు రెండు దెబ్బలు ఎదురేసి మరి.. వాళ్లను కంట్రోల్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు అవునా?
మరి.. ఒక కుటుంబ పెద్దగా ఉన్న మీరే ఇంతలా రియాక్ట్ అయితే.. ఒక పెద్ద పార్టీ అధినేత మరెంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ప్రజలు దారుణంగా రిజెక్ట్ చేసి.. జీవితంలో ఎప్పుడూ కానంత దారుణ పరాజయం ఎదురైన వేళ.. మరెంత జాగ్రత్తగా ఉండాలి? ప్రత్యర్థి బలంగా ఉండి.. తన మూలాల్ని కదిలించే రీతిలో సవాలు చేస్తున్న వేళ.. తానెంత జాగురూకతో ఉండాలి?
కానీ.. ఇలాంటివేమీ చేయని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. సొంత పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. మరో సీనియర్ నేత బుద్ధా వెంకన్నలు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా తిట్టేసుకోవటం పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తుందన్న విషయాన్ని బాబు ఎందుకు గుర్తించనట్లు?
మిగిలిన ప్రాంతీయ పార్టీల అధినేతలతో పోలిస్తే చంద్రబాబు బలహీనత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవటంలో అదే పనిగా కన్ఫ్యూజ్ అయ్యేతీరు ఆయనకు మొదట్నించి ఉన్నదే.
పార్టీలో ఇబ్బందికరంగా మారిన వారి విషయంలో చర్యలపై తేల్చుకోలేని తత్వం బాబుకు మొదట్నించి ఉన్నదే. అదే ఇప్పుడు పార్టీకి శాపంగా మారిందని చెప్పక తప్పదు. కేశినేని నాని.. బుద్దా వెంకన్న ఎపిసోడ్ షురూ అయిన వెంటనే ఆదేశాలు జారీ చేసి.. ఇద్దరిని పిలిపించి ఆక్షింతలు వేసి.. కొట్టుకునే సమయం ఇది కాదురా నాయనా? అంటూ చెప్పాల్సిన చంద్రబాబు.. తనకేం సంబంధం లేనట్లుగా ఉరుకొండిపోవటంతో ఈ ఇష్యూ మరింత పెద్దదిగా మారి పార్టీ పరువు పోయిన పరిస్థితి.
ఇలాంటి వేళ.. ఆలస్యంగా స్పందించిన బాబు తాజాగా ఇద్దరిని తనను కలవాల్సిందిగా టైమిచ్చారు. అంతా బాగానే ఉంది కానీ.. ఇంతకీ బాబు మాటను కేశినేని వారు వింటారా? అన్నది ఒక ప్రశ్న అయితే.. అంతా కాలిపోయిన తర్వాత ఫైరింజన్ వచ్చినట్లుగా.. పార్టీ పరువు మొత్తం తీసుకెళ్లి బెజవాడ బెంజ్ సర్కిల్ దగ్గర కిలోల లెక్కన అమ్మేయటం పూర్తి అయ్యాక.. కళ్లు తెరిచి డ్యామేజ్ కంట్రోల్ చేయాలనుకోవటం ఏంది బాబు? దీని వెనుకున్న లాజిక్ మీకైనా తెలుసా?