Begin typing your search above and press return to search.
బాబు గారికి క్లారిటీ వచ్చింది...
By: Tupaki Desk | 24 May 2015 4:58 AM GMT ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇన్నాళ్లూ డిమాండ్ లు సాగుతున్న విషయం తెలిసిందే. అప్పటి సమైక్యాంధ్ర ఉద్యమం స్థాయిలో ఇప్పుడు ప్రత్యేక హోదా సాధన అక్కడి ప్రజల మనస్సుల్లో ఉందనటం ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. అయితే కేంద్ర ప్రభుత్వం రోజుకో రకంగా స్పందిస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి ఆరుణ్ జైట్లీ పుండు మీద కారం చల్లారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామనే హామీ ఉన్నప్పటికీ...ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని, ఆ రాష్ట్రాలు ఎదుర్కొనే ఆదాయలోటును భర్తీ చేయడానికి కేంద్రం నిధులివ్వాలని మాత్రమే 14వ ఆర్థిక సంఘం చెప్పిందని అన్నారు. హైదరాబాద్ తెలంగాణలోకి వెళ్లడం వల్ల ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన ఆదాయాన్ని పూరించేందుకు వనరుల్ని సమకూరుస్తామని చెప్పారు.
దీనిపై ఒకింత అసహనం వ్యక్తం చేస్తూనే ఏదో ఒక రకంగా ఆదుకోవాలి అంటూ ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా ‘కేంద్రం ఏదో ఒక రకంగా రాష్టాన్ని ఆదుకోవాలి. ఇతర రాష్ట్రాల స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చెందేవరకూ (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) సహకరించాలి. అది ప్రత్యేక హోదా ఇవ్వటం ద్వారానా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటం ద్వారానా, వెనుకబడిన ప్రాంతాలకు అభివద్ధి నిధులు విడుదల చేయడం ద్వారానా, ప్రత్యేక నిధులు మంజూరు చేయడం ద్వారానా అన్నది కేంద్రం ఇష్టం’ అని వ్యాఖ్యానించారు. కాగ్ నివేదిక ప్రకారం రూ.14,500 కోట్ల రెవెన్యూ లోటులో ఉందని తేలిందని, తుది లెక్కల ప్రకారం అది రూ.15,500 కోట్లకు చేరనుందన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇన్నాళ్లూ డిమాండ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని, ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టకుండా... కేంద్రం ఏదో రకంగా ఆదుకుంటే చాలంటూ మాట్లాడుతున్నారనే విమర్శలు బాబుపై మొదలయ్యాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మనసెరిగి, వారు హోదా గురించి కరాఖండీగా నో అనే పరిస్థితులు ఉన్నాయనుకున్న నేపథ్యంలోనే ఈ విధంగా బాబు మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు.