Begin typing your search above and press return to search.
భూమాకు మంత్రి పదవి రాకుండా చేసింది జగనే!
By: Tupaki Desk | 14 March 2017 12:09 PM GMTభూమా నాగిరెడ్డి మృతి అనంతరం టీడీపీ - వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. భూమా మృతికి చంద్రబాబే కారణమని జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. జగన్ మాటలను చంద్రబాబు తప్పుపట్టారు. అంతేకాదు.. భూమాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకు జగన్ అన్ని ప్రయత్నాలు చేశారని కూడా ఆరోపించారు. జగన్ గవర్నర్ ను కలిసి భూమాకు మంత్రిపదవి ఇవ్వొద్దని చెప్పారని.. ఇప్పుడు అదే నోటితో మంత్రిపదవి దక్కకపోవడం వల్లే గుండెపోటుతో మరణించారని అంటున్నారని ప్రత్యారోపణలు చేశారు.
రాజకీయ విభేదాలున్నా వ్యక్తిగత జీవితంలో అవి కనిపించరాదని చెప్పిన చంద్రబాబు.. వైఎస్ మరణించినప్పుడు తాను వెళ్లి జగన్ ను పరామర్శించి వచ్చానని గుర్తు చేశారు. రాజకీయాలలో తనను వైఎస్ రాజశేఖరరెడ్డి విమర్శించినంతగా మరెవరూ విమర్శించలేదని చెప్పిన చంద్రబాబు ఆయన మరణించినప్పుడు సాటి మనిషిగా తాను పరామర్శించానని గుర్తు చేశారు. అనంతరం అంత్యక్రియలకు ఇడుపులపాయకు బయల్దేరానని, అయితే ట్రాఫిక్ వల్ల వెళ్లలేకపోయానని చెప్పారు. అంతేకాకుండా పులివెందులలో విజయమ్మ పోటీ చేస్తే తమ అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని గుర్తుచేశారు. వైసీపీ సభ్యులు మాత్రం సంప్రదాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో సంతాప తీర్మానానికి కూడా జగన్ రాలేదని ఇది ఆయన వైఖరి, స్థాయి అని విమర్శించారు. అనవసర రాద్ధాంతం మానుకోవాలని హితవు చెప్పారు.
‘
చంద్రబాబుకు నాకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది’ అని జగనే చెప్పాడని.. ప్రజలు నిజంగానే ఇప్పుడా తేడాను గమనించారని చంద్రబాబు అన్నారు. నాగిరెడ్డిని క్షోభకు గురి చేసింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. సాటి జీవి చనిపోతే పక్షులు, పశువులు సైతం తమ సానుభూతి చూపుతాయి, కానీ, జగన్ మాత్రం సాటి మనిషిపై సానుభూతి చూపలేకపోయారన్నారు. నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియను మేము సభకు పిలవకపోయినా.. తన తండ్రి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నందున బాధ్యతగా ఆమె వచ్చారు అని చంద్రబాబు తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/