Begin typing your search above and press return to search.
జగన్ ఆస్తుల టేకోవర్ పై బాబు చూపు
By: Tupaki Desk | 21 Feb 2016 5:29 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా మరింత పదునైన వ్యూహాన్ని అమల్లో పెడుతున్నారు. ప్రజాసంక్షేమం కోణాన్ని ప్రస్తావిస్తూ...ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆస్తులను ప్రభుత్వ పరం చేయాలని డిసైడ్ చేశారు. అయితే తానేమీ వ్యక్తిగత ఉద్దేశంతో అడుగులు వేయట్లేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం, ఎన్నికల్లో ఇచ్చిన హామీనే అమలుచేస్తున్నానని బాబు తెలిపారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై మండిపడ్డారు. "వైఎస్ కుటుంబం జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చేసి కమిషన్లకు కక్కుర్తిపడ్డారు. అవినీతితో ఆస్తులు కూడబెట్టుకున్నవాళ్లా నన్ను విమర్శించేది? అటాచ్ మెంట్ లో ఉన్న సాక్షి పత్రిక ప్రభుత్వానిది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తోంది. ఎటాచ్ మెంట్లకు సంబంధించి పార్లమెంటులో బిల్లు పాసవ్వగానే స్వాధీన ప్రక్రియ మొదలెడతాం. అది ప్రభుత్వ ఆస్తి, ప్రజలకు చెందుతుంది. అవినీతిని అంతమొందించేందుకే ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటయ్యాయి. ఆస్తులు ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇదే హామీ ఇచ్చాం.."అని చంద్రబాబునాయుడు హెచ్చరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. అవినీతికి పాల్పడిన సత్యం కంప్యూటర్స్ ఆస్తులు ఎవరికి వెళ్లాయో గుర్తు చేసుకోవాలని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో జరిపిన అక్రమ కేటాయింపులన్నింటిపై విచారణ చేపడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. లేపాక్షి భూములను వదులుకోబోమని ఈ సందర్భంగా చంద్రబాబు తేల్చిచెప్పారు.