Begin typing your search above and press return to search.
జేసీని చంద్రబాబు ఏమీ అనలేరా?
By: Tupaki Desk | 22 Dec 2016 12:30 AM GMTనోరున్నోడిని ఎవరూ ఏమీ చేయలేరని మరోసారి ప్రూవ్ అయింది. పార్టీ నేతలను అలా నిలబెట్టి దుమ్ము దులిపేసే నేతగా పేరున్న చంద్రబాబు వద్ద టీడీపీలో ఎంత సీనియర్లయినా జాగ్రత్తగా ఉంటారు. కానీ... బయటకు చెప్పుకోలేరు కానీ చంద్రబాబుకు కూడా కొందరు నేతలంటే భయమట. ఆ సంగతి తెలిసే ఆ నేతలు అప్పుడప్పుడు చంద్రబాబును గడ్డిపరకలా తీసిపడేస్తూ మాట్లాడుతుంటారట. వారిని ఏమీ అనలేక... అంటే ఇంకేమైనా అంటారేమో.. మరింత పరువు పోతుందేమో అన్న భయంతో చంద్రబాబు కూడా కామ్ అయిపోతుంటారట. పిలిచి మందలించే ధైర్యం లేక అక్కడా ఇక్కడా ఏదో ఒకటి అని అన్నాననిపించుకోవడమే తప్ప చేసేదేమీ ఉండదు.
చంద్రబాబు ఒక్కడి వల్లే టీడీపీ అధికారంలోకి రాలేదని, పిలవగానే జనం రావడానికి చంద్రబాబు ఏమీ గాంధీ మహాత్ముడు కాదంటూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అధికారులతో రాజ్యం నడుపుతున్నారని, విధానం మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జేసీ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అవుతారని... ఆయన్ను పిలిపించి క్లాసు పీకుతారని అంతా భావించారు. కానీ... చంద్రబాబు మాత్రం శాపనార్థరాలతో సరిపెట్టడం తప్ప ఏమీ చేయలేకపోయారు. లూజ్ టాక్ తో వాళ్ల నాయకత్వమే బలహీనపడుతుందని, అలాంటివారు పార్టీకి దూరమవుతారని జేసీకి కౌంటర్ ఇచ్చారు.
ఆ తరువాత ఎప్పటిలా తన సూక్తిముక్తావళితో సరిపెట్టేశారు. పార్టీలో అందరూ సమానమేనని, ఎవరికీ మినహాయింపులు ఉండవన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. నాయకుడు సమర్థవంతంగా లేకపోతే నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నా ఫలితం ఉండదని నీతి వ్యాఖ్యాలు మాత్రం చెప్పారు. దీంతో చంద్రబాబు స్పందన చూసిన పార్టీ సీనియర్లు - మంత్రులు అంతా.. జేసీలా తిరగబడితే కానీ ఈయన దారికి రాడన్నమాట అనుకుంటున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/