Begin typing your search above and press return to search.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న బాబు
By: Tupaki Desk | 2 Nov 2017 11:30 PM GMTరేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాక కానీ చంద్రబాబుకు తెలంగాణ గుర్తొచ్చినట్లు లేదు. తెలుగుదేశం పార్టీకి ఇంకా ఒకరిద్దరు నేతలు మిగిలి ఉన్నారన్న విషయం గుర్తొచ్చిందో ఏమో కానీ చాలాకాలం తరువాత ఆయన హైదరాబాద్ లో పార్టీ సమావేశం నిర్వహించారు. అయితే... ఈ సమావేశాన్ని విస్తృత స్థాయి సమావేశం అని అనడం మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్లకు చేతి నిండా పని చెప్పింది. తెలంగాణలో టీడీపీ అంత విస్తృత స్థాయిలో ఉందా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
తెలంగాణలో టీడీపీ పరిస్థితి కామెడీ అయిపోయాక ఈ సెటైర్లు సాధారణమే కాబట్టి చంద్రబాబు కూడా ఇదంతా పట్టించుకోకుండా సమావేశానికి వచ్చినవారిని ఉద్దేశించి పెద్దపెద్ద డైలాగులు చెప్పారు. రాజకీయాల్లో సమస్యలు - ఇబ్బందులు సాధారణమేనని తాజా పరిస్థితికి అద్దంపట్టే మాటలు చెప్పారు. తెదేపా తెలుగు ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించే పార్టీ అని అన్నారు.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని... కార్యకర్తల్లో చైతన్యం నింపడానికే హైదరాబాద్ కు వచ్చానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇకపై నెలకోసారి సమీక్షలు చేద్దామని.. వీలైనన్ని సార్లు తానూ వస్తాను చెప్పారు.ఎప్పటిలా తనదైన శైలిలో హైదరాబాద్ కు తానేం చేశానో కూడా చెప్పుకొన్నారు. హైదరాబాద్ లో మత సామరస్యాన్ని కాపాడగలిగానని... కర్ఫ్యూ పరిస్థితి రాకుండా చేయగలిగానని అన్నారు. అయితే... కార్యకర్తల్లో చైతన్యం నింపడం.. నెలకోసారి సమీక్ష వంటి చంద్రబాబు మాటలపై నేతలు మాత్రం చెవులు కొరుక్కున్నారు. ఇదేదో ముందే జరిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్న విమర్శలు పార్టీ వర్గాల నుంచి వినిపించాయి.