Begin typing your search above and press return to search.
ఎవరో చెప్తేనే బాబు అలా చేశారంట
By: Tupaki Desk | 17 Dec 2016 5:54 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు ఇబ్బంది కలిగించే విషయాల్లో ఎంత లౌక్యంగా వ్యవహరిస్తారో మరోమారు నిరూపించే ఉదాహరణ ఇది. టీడీపీ ధర్మకర్త మండలిలో సభ్యుడుగా ఉండి పెద్ద ఎత్తున లెక్కలు చూపని నగదుతో పదవి కోల్పోయిన తమిళనాడుకు చెందిన శేఖర్ రెడ్డి గురించి బాబు ఆసక్తికరమైన క్లారిటీ ఇచ్చారు. శేఖర్ రెడ్డికి ఎవరో సిఫార్సు చేస్తే టీటీడీ బోర్డులో స్థానం కల్పించామని చెప్పిన బాబు తప్పు చేయడంతో తీసేశామని ఆయన ప్రకటించారు. తిరుపతిలో బర్డు ఆసుపత్రి ఓపి బ్లాక్ - నూతన ఆపరేషన్ థియోటర్ - సిమ్స్ లో మహిళా వైద్య కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ మేరకు వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన శేఖర్ రెడ్డి అంశాన్ని విలేఖరులు సీఎం చంద్రబాబు ముందు ప్రస్తావించినప్పుడు ఎవరో సిఫార్సు చేస్తే టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించామని అన్నారు. తప్పు చేశాడని తేలడంతో తక్షణం పదవినుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నామని బాబు క్లారిటీ ఇచ్చారు. సమాజంలో అనేక పొరపాట్లు జరుగుతుంటాయని చెప్పిన చంద్రబాబు తప్పులు తెలుసుకున్నప్పుడు సరిదిద్దుకోవాలన్నారు. మీ మీడియాలో కూడా అనేక తప్పులు జరుగుతుంటాయి కదా అని సెటైర్ వేశారు. ఇదిలాఉండగా సమాజానికి ఉపయోగపడే విధంగా వినూత్నంగా ఆలోచించినప్పుడే విద్యకు సార్థకత చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తిరుపతిలో రూ.182.11 కోట్లవ్యయంతో స్విమ్స్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి మహిళా వైద్యవిద్య కళాశాలను ఆయన ప్రారంభించారు. అనంతరం వైద్య కళాశాల విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 25-37 సంవత్సరాలులోపు ఎవరైనా వినూత్న ఆలోచనలు చేయగలరని చంద్రబాబు అన్నారు. ఈక్రమంలో 18 సంవత్సరాల వయస్సులో వైద్య విద్యలోకి అడుగుపెట్టిన మీరందరు వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని, అవి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంలో సిలికాన్ సిటీ కన్నా ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో ఉంచాలన్నది తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. అమెరికాలో ఉన్న డాక్టర్లు కన్నా భారతదేశంలో ఉన్న డాక్టర్లు గొప్ప పరిజ్ఞానం ఉన్నవారని చెప్పారు. బ్రెయిన్ డ్రైయిన్ అనే మాట నేడు ఉందన్నారు. అదే అంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న ఆధునిక సాంకేతిక విజ్ఞాన వినియోగంతో డ్రైయిన్ కం బ్యాక్ అనే మాట వింటారని చంద్రబాబు జోస్యం చెప్పారు. అమెరికా వెళ్ళినవారంతా తిరిగి భారతదేశానికి వస్తారని భరోసా వ్యక్తం చేశారు. స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ భారతదేశంలో వైద్య విద్యను నేర్చుకుని అమెరికాకు వెళ్ళి తిరిగి వచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. స్విమ్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో 10వ స్థానంలో ఉంచాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. జనవరిలో తిరుపతిలో జరుగనున్న ఇస్కా సమావేశాలు అదే సమయంలో మహిళ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న చిల్డ్రన్ సైన్స్ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/