Begin typing your search above and press return to search.
కవర్ చేయటానికి బాబు చాలానే కష్టపడ్డారు
By: Tupaki Desk | 4 July 2016 10:25 AM GMTకృష్ణా పుష్కరాల సందర్భంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలోని ఆలయాల్ని పెద్ద ఎత్తున కూల్చివేసిన ఘటన సంచలనంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం.. దీనిపై బాబు సర్కారు వెనక్కి తగ్గి.. ఇకపై దేవాలయాల్ని టచ్ చేయమని చెప్పటం తెలిసిందే. ఆలయాల కూల్చివేతపై మూడు రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నా.. స్పందించని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా రియాక్ట్ అయ్యారు. దేవాలయాల కూల్చివేత మీద ఆచితూచి మాట్లాడిన ఆయన.. మంత్రుల మాదిరి తప్పును అధికారుల మీద వేయకుండా.. జరిగిన ఘటనను సమర్థించుకోకుండా జాగ్రత్తగా మాట్లాడిన వైనం కనిపించింది.
తమ సర్కారు చేసిన తప్పును కవర్ చేసేందుకు బాబు చాలానే కష్టపడినట్లు స్పష్టంగా కనిపించింది. ఎవరి మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరించటం తమ ప్రభుత్వ లక్ష్యం కాదన్న చంద్రబాబు.. విజయవాడ నగరంలోని పలు దేవాలయాలు రహదారులను ఆనుకొని కట్టటం వల్లే లాంటి సమస్యలు ఎదురైనట్లు చెప్పుకొచ్చారు. రోడ్లను విస్తరించాలన్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. కొందరు మీడియాను అడ్డం పెట్టుకొని అల్లర్లు రేపటానికి ప్రయత్నిస్తున్నారన్న చంద్రబాబు.. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన మాటలు ఏపీ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపించాయి. అయితే.. దేవాలయాల్ని కూల్చిన ఘటనపై తమ మిత్రపక్షం బీజేపీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వైనాన్ని బాబు ప్రస్తావించకుండా ఉండటం.. ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవటం గమనార్హం.