Begin typing your search above and press return to search.

త‌లాక్ బిల్లు..టీడీపీలో చీలిక‌ల‌కు కార‌ణ‌మైందా?

By:  Tupaki Desk   |   30 Dec 2017 9:51 AM GMT
త‌లాక్ బిల్లు..టీడీపీలో చీలిక‌ల‌కు కార‌ణ‌మైందా?
X
దేశంలోని ముస్లిం మహిళల గుండెలపై కుంపటిగా మారిన ‘ట్రిపుల్ తలాక్’ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తూ, ఈ తప్పు చేసే వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించేలా ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు’ను లోక్‌ సభ గురువారం ఆమోదించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప‌రిణామం ఏపీలో అధికార పక్ష‌మైన టీడీపీలో లుక‌లుక‌లు కార‌ణ‌మైంద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. పార్టీకి చెందిన కొంద‌రు ఈ బిల్లును స‌మ‌ర్థిస్తుండ‌గా..మ‌రికొంద‌రు వ్య‌తిరేకిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ వార్త‌ల‌పై ఏకంగా పార్టీ ర‌థ‌సార‌థి - ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు.

ట్రిపుల్ తలాక్ రద్దు సమర్థనీయమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. అయితే విడాకుల కోసం క్రిమినల్ ప్రాసిక్యూషన్ సరికాదన్నారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో త్రిపుల్ తలాక్ రద్దు గురించి అడిగిన ప్రశ్నపై ఆయన స్పందిస్తూ, ఈ అంశాన్ని తాను పరిశీలిస్తున్నానన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ఈ విష‌యంలో పార్టీలో భిన్నాభిప్రాయాల‌పై క్లారిటీ ఇచ్చారు. త‌లాక్ బిల్లు విషయమై తమ పార్టీలో విభేధాలు లేవని చెప్పారు. కానీ త్రిపుల్ తలాక్ చెల్లందంటే, ఈ అంశాలు రెగ్యులర్ ప్రోసీజర్ పరిధిలోకి వస్తాయన్నారు. రెగ్యులర్ క్రిమినల్ చర్యలనే అనుసరించాల్సి ఉంటుందన్నారు. దీనిని చాలా మంది వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు.

త్రిపుల్ తలాక్ లేదంటే, విడాకుల కోసం రెగ్యులర్ కోర్టులకు వెళ్లాల్సి ఉంటుందని చంద్ర‌బాబు న్నారు. క్రిమినల్ ప్రాసిక్యూషన్ సరికాదని, దీని వల్ల చాలా సమస్యలు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. చదువుకున్న చాలా మంది త్రిపుల్ తలాక్ రద్దు సమర్థిస్తున్నారని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. రద్దును 72 శాతం మంది ముస్లింలు సమర్థిస్తున్నారని తెలిపారు. ఇందులో 48శాతం మంది మహిళలు, 54 శాతం మంది పురుషులు ఉన్నారన్నారు. ఈ విషయమై హిందువుల్లో 49 శాతం మంది మహిళలు, 51 శాతం మంది పురుషులు సమర్దిస్తున్నారన్నారు. ప్రగతిశీల ఆలోచనల కారణంగా రద్దుకు మద్దతు పలుకుతున్నారని చంద్ర‌బాబు విశ్లేషించారు.