Begin typing your search above and press return to search.

రాష్ట్రాన్ని అభాసుపాలు చేయాలని చూస్తున్నారు

By:  Tupaki Desk   |   1 Feb 2016 10:13 PM IST
రాష్ట్రాన్ని అభాసుపాలు చేయాలని చూస్తున్నారు
X
తునిలో జరిగిన సంఘటనకు వైఎస్సార్సీపీనే కారణం అని బాబు అన్నారు. పులివెందుల నుంచి రౌడీలను పంపించి దౌర్జన్యం చేయిస్తామంటే ఊరుకునేది లేదని చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. అవినీతి సొమ్మతో ఏమైనా చెయ్యొచ్చని అనుకుంటే ఊరుకునేది లేదని వైఎస్సార్సీపీ అధినేతకు హెచ్చరిక పంపారు. రాష్ట్రం అభివృద్ది చెందాలని తాను అహర్నిశలు కృషి చేస్తుంటే.. వైఎస్సార్సీపీ నాయకులు మాత్రం అరాచకం సృష్టించి... రాష్ట్రాన్ని అభాసుపాలు చేయాలని చూస్తున్నారన్నారు.

అవినీతి సొమ్ముతో ఏదైనా చెయ్యొచ్చని అనుకుంటున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేదేలేదన్నారు. 1999 ఎన్నికల్లో కాపుల రిజర్వేషన్ విషయమై ఎలాంటి హామీ ఇవ్వకపోయినా... టీడీపీ పార్టీకి అత్యధిక సీట్లు అందించారని, గోదావరి వరదలప్పడు తాను స్పందించిన విధానం నచ్చే టీడీపీకి అప్పుడు బ్రహ్మరథం పట్టారని, గత ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటేనే టీడీపీకి అక్కడ ఎక్కవు సీట్లు వచ్చాయని చెప్పడంలో అర్థం లేదన్నారు. ఎన్నికలకు ముందు హామి ఇచ్చినట్టుగానే వారికి కాపు కార్పొరేషన్ ను రూ.100 కోట్లతో ఏర్పాటు చేశామన్నారు. దాన్ని దశలవారికి పెంచుతూ పోతామన్నారు. ఎంతో ప్రశాంతతకు మారు పేరైన అలాంటి జిల్లాలలో ఇప్పుడు అల్లర్లు సృష్టిస్తామంటే ఊరుకోబోమన్నారు.