Begin typing your search above and press return to search.
నా ఫ్యామిలీ ఫోన్లే ట్యాప్ చేసే పరిస్థితి వచ్చింది
By: Tupaki Desk | 15 Aug 2015 6:16 AM GMTగతానికి భిన్నంగా హైదరాబాద్ మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మక్కువ ప్రదర్శించటం లేదు. ఉన్నట్లుండి ఆయన.. విజయవాడకు మకాంను మార్చేయటమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగులు సైతం రెండు నెలల్లో విజయవాడకు వచ్చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
గతంలో హైదరాబాద్ ను విడిచి పెట్టేందుకు ఏ మాత్రం ఇష్టపడనట్లుగా ఉండే ఆయన వైఖరికి భిన్నంగా చంద్రబాబు ఇప్పుడు తన ఫోకస్ అంతా బెజవాడ మీద పెట్టటం కనిపిస్తోంది. ఇలాంటి మార్పు ఎందుకొచ్చిందన్న అంశంపై ఓటుకునోటు.. ఫోన్ ట్యాపింగ్ ఉదంతాలే కీలక భూమిక పోషించాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ వాదనను బలపర్చేలా మీడియాతో మాట్లాడిన బాబు వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. టెలిఫోన్ ట్యాపింగ్ గురించి తాను ఎక్కువ మాట్లాడనని.. కానీ.. తన.. తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసే పరిస్థితి వచ్చిందంటే.. ఎలాంటి పరిస్థితి ఉందన్నది అర్థం చేసుకోవాలన్న వ్యాఖ్య చేశారు.
తన మీద ఇప్పటికే చాలా కుట్రలు చేశారని.. అయినా అలాంటివేమీ పని చేయలేదని చెప్పిన ఆయన.. ప్రజల్లో తన మీద ఉన్న విశ్వసనీయతే సదరు కుట్రలకు సమాధానం చెప్పిందన్న చంద్రబాబు.. తన మీద కుట్రలు పన్నిన వారు ఎక్కడికి పోయారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందన్న ఆయన.. తనను ఎవరూ ఏమీ చేయలేరని.. గతమే దీనికి పెద్ద ఉదాహరణ అంటూ ధీమా వ్యక్తం చేశారు.