Begin typing your search above and press return to search.
ఏం వర్షాలు ఉన్నాయని ఈ సమీక్ష బాబు..?
By: Tupaki Desk | 7 Aug 2015 4:43 AM GMTఏపీ ముఖ్యమంత్రికి ప్రచార కాంక్ష కాస్త ఎక్కువేనన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఏ చిన్న అవకాశం వచ్చినా ఆయన మీడియాతో మాట్లాడే అవకాశాన్ని వదులుకోరన్న విషయం తెలిసిందే. పెళ్లాం.. పిల్లలతో కలిసి విహార యాత్రకు వెళ్లిన చంద్రబాబు.. అటు కుటుంబంతో ఎంజాయ్ చేయకుండా.. ఇటువైపు అరకొర ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వర్తించటం చూసినప్పుడు మరీ.. ఇంత అవసరమా అనిపించక మానదు.
ప్రస్తుతం టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో ఉన్న చంద్రబాబు.. గురువారం అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఫ్యామిలీ టూర్ కి వెళ్లిన చంద్రబాబు.. అంత హడావుడిగా.. కుటుంబ సభ్యులను వదిలిపెట్టి.. ఏ విషయం మీద అంత కొంపమునిగిపోతున్నట్లు రివ్యూ మీటింగ్ పెట్టారా? అని చూస్తే కించిత్ ఆశ్చర్యం కలగకమానదు.
వర్షాకాలం సందర్భంగా ప్రబలే విష జ్వరాల కోసం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి ఆదేశాలు జారీ చేశారు. డెంగ్యూతో సహా అన్ని రకా జ్వరాలకు మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఫ్యామిలీతో హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న ఆయనకు.. ఉన్నట్లుండి విష జ్వరాల మీద ఎందుకు రివ్యూ పెట్టారని చూస్తే.. ఈ మధ్య కాలంలో ఏపీలో విష జ్వరాల కారణంగా కొన్ని మరణాలు చోటు చేసుకోవటం.. దీనిపై విమర్శలు వెల్లువెత్తటంతో ఆయన అలెర్ట్ అయ్యారు.
నిజంగా చంద్రబాబుకు ముందుచూపు ఉంటే.. సీజనల్ వ్యాధుల గురించి.. సీజన్ మారటానికి పది రోజుల ముందే హెచ్చరించాల్సింది పోయి.. వర్షాకాలం మొదలై.. మధ్యలోకి వచ్చిన తర్వాత రివ్యూ సమావేశం నిర్వహించటం ఏమిటి? అయినా.. ఓ పక్క వర్షాభావంతో పంటలు ఎండిపోయి.. రైతులు దిగాలుగా పడి ఉంటే.. దాని గురించి పెదవి విప్పని చంద్రబాబు.. వర్షాకాలంలో వచ్చే విష జ్వరాల మీద రివ్యూ సమావేశం పెట్టటం కాస్తంత కామెడీగా లేదు? పదకొండేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తికి ప్లానింగ్ గురించి చెప్పాల్సి రావటం నిజంగానే ఏపీ ప్రజల బ్యాడ్ లక్ గా చెప్పాలి.