Begin typing your search above and press return to search.

బాబు బ్యాక్ గ్రౌండ్ ఎందుకు మారినట్లు?

By:  Tupaki Desk   |   3 Feb 2018 5:05 AM GMT
బాబు బ్యాక్ గ్రౌండ్ ఎందుకు మారినట్లు?
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కీల‌క‌మైన స‌మావేశాలు.. రివ్యూలకు సంబంధించి మీడియాలో అచ్చేసే వార్త‌ల్లో ఆయ‌న ఫోటోను త‌ప్ప‌నిస‌రిగా అచ్చేస్తుంటారు. ఈ సంద‌ర్భంగా వెనుక బుద్ధిడితో ఉన్న బొమ్మ క‌నిపిస్తూ ఉంటుంది. తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మైన బాబు బ్యాక్ గ్రౌండ్ ఈసారి మారింది.

ఈ మ‌ధ్య‌న బాబు ఫారిన్ టూర్ కు వెళ్లిన‌ప్పుడు.. ఆయ‌న వియ్యంకుడు.. ఎమ్మెల్యే బాల‌య్య సీఎం రివ్యూ ఛాంబ‌ర్లో ఆయ‌న కుర్చీలో కాకుండా వేరే కుర్చీలో కూర్చొని రివ్యూ చేసిన వైనం వార్త‌ల్లోకి వ‌చ్చింది. బాల‌య్య చేసిన రివ్యూ కంటే కూడా.. ఆయ‌న కూర్చున్న కుర్చీ.. బ్యాక్ గ్రౌండ్ లో ఉండే బుద్దుడు బొమ్మ మీద పెద్ద చ‌ర్చే న‌డిచింది.

రివ్యూ పేరుతో బాల‌య్య సీఎం చంద్ర‌బాబు కుర్చీలో కూర్చున్నార‌న్న ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వ‌చ్చాయి. త‌న తండ్రి ఎన్టీఆర్ ను ప‌ద‌వి నుంచి అన్యాయంగా దించేసిన చంద్ర‌బాబు.. త‌న తండ్రి కూర్చోవాల్సిన కుర్చీలో కూర్చున్నార‌న్న బాధ‌తోనే.. బాబు ఫారిన్ లో ఉన్న వేళ ఆయ‌న కుర్చీలో బాల‌య్య కూర్చోవ‌టం ద్వారా త‌న కోరిక‌ను తీర్చుకున్న‌ట్లుగా విప‌క్ష నేత‌లు కొంద‌రు వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మోడీ స‌ర్కారు బ‌డ్జెట్ పైన పార్టీ నేత‌ల‌తో భారీ మీటింగ్ పెట్టుకున్న చంద్ర‌బాబు.. ఆయ‌న కుర్చీ వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ మొత్తంగా మారిపోవటం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కూ బాబు రివ్యూ చేసిన కార్య‌క్ర‌మానికి సంబంధించిన పిక్ లో వెనుక క‌నిపించాల్సిన బుద్దుడు ఎందుకు క‌నిపించ‌లేద‌న్న‌ది చూస్తే ఆస‌క్తిక‌ర అంశం బ‌క‌టి బ‌య‌ట‌కు రాక మాన‌దు.

ఈ మ‌ధ్య‌న బాబు రివ్యూ గ‌దిలో బాబు మాదిరే కూర్చొని బాల‌య్య చేసిన రివ్యూ పై వెల్లువెత్తిన విమ‌ర్శ‌లో.. స్థ‌లాభావంతోనో బాబు త‌న రివ్యూ గ‌దిని మార్చారు. ఉండ‌వ‌ల్లిలోని ప్ర‌జాద‌ర్బారు హాల్లో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. దీంతో.. రెగ్యుల‌ర్ గా వ‌చ్చే బ్యాక్ గ్రౌండ్‌కి మార్పుగా తాజా మార్పు వచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రెగ్యుల‌ర్ గా బాబు పిక్ లో బ్యాక్ గ్రౌండ్ లో వ‌చ్చే బుద్దుడి స్థానాన్ని తాజాగా మ‌రొక‌టి క‌నిపించ‌టం వెనుక అస‌లు విష‌యం ఇదే.