Begin typing your search above and press return to search.

కొంపదీసి బాబు ఆ రూల్ పెడతారా?

By:  Tupaki Desk   |   12 April 2016 7:02 AM GMT
కొంపదీసి బాబు ఆ రూల్ పెడతారా?
X
అగ్రహంతో అన్నారో.. కచ్ఛితంగా చేసి చూపించాలని అన్నారో కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి వచ్చిన ఒక మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. ఏపీ ఉద్యోగులకు చెమటలు పట్టేలా చేస్తోంది. విశాఖపట్నంలో బాబు నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవరణలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలన్న తన మాటను గుర్తు చేస్తూ.. ఇప్పటివరకూ ఆ పని చేయకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాను చెప్పిన తర్వాత కూడా ఏర్పాటు చేయకపోవటానికి కారణం ఏమిటంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీని ప్రశ్నించగా.. రూల్స్ ఒప్పుకోవని సమాధానం చెప్పటంతో బాబుకు ఆగ్రహం ఒక రేంజ్ లో వచ్చింది. కంపెనీలకు కార్పొరేట్ రెస్పాన్స్ బులిటీ (కంపెనీల సామాజిక బాధ్యత) లేదా? అంటూ ప్రశ్నించిన చంద్రబాబు మీరు రోజూ వాకింగ్ చేస్తున్నారా? అని ప్రశ్నించి.. ఉద్యోగులకు మార్నింగ్ అవసరం లేదా? అంటూ క్లాస్ పీకారు.

ఈ కోపంలోనే ఆయన.. ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులంతా రోజూ మార్నింగ్ వాక్ చేయాలంటూ రూల్ పెడతానని వ్యాఖ్య చేయటంతో వారంతా ఒక్కసారి ఉలిక్కిపడే పరిస్థితి. ఎంత కోపంలో ఉంటే మాత్రం.. రోజూ మార్నింగ్ వాక్ చేయాలంటూ రూల్ పెట్టేస్తానని చెప్పటమేమిటి? అంటూ అధికారులు చెవులు కొరుక్కునే పరిస్థితి. చెప్పిన పని చేయనప్పుడు ఆగ్రహం కలగటం తప్పు కాదు. కానీ.. కోపంతో ప్రతిదానికి రూల్ పెట్టేస్తానని చెప్పటం కూడా సరికాదన్న విషయాన్ని బాబు గుర్తిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ మార్నింగ్ వాక్ మీద బాబు నిజంగానే రూల్ పెడతారా?