Begin typing your search above and press return to search.
కుప్పంలో కన్ను ఎందుకు లొట్టపోయింది
By: Tupaki Desk | 4 Jun 2019 5:29 AM GMTకుప్పం నియోజకవర్గం అంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు కంచుకోట. అక్కడ ప్రతి ఎన్నికల్లోనూ ఆయన మెజారిటీ పెరుగుతుంటుంది. కుప్పంలో గెలుపోటముల గురించి ఎవరూ చర్చించుకోరు.. చంద్రబాబుకు ఎంత మెజారిటీ వస్తుందనేదే అక్కడ చర్చ. కానీ.. ఈసారి ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని రౌండ్లలో చంద్రబాబు వెనుకపడడం... వైసీపీ అభ్యర్థి గట్టి పోటీ ఇవ్వడం.. చంద్రబాబు మెజారిటీ గత ఎన్నికల కంటే సుమారు 40 వేలు తగ్గిపోయి 30 వేలకే పరిమితం కావడం వంటివన్నీ చంద్రబాబును కలవరపరిచాయి.
నిజానికి అక్కడ వైసీపీ అభ్యర్థి ఒక్క రోజు కూడా ప్రచారం చేయలేదు. ఆయన అనారోగ్యంతో ఉండి ఆసుపత్రి బెడ్‌కే పరిమితమయ్యారు. ఆయన తరఫున కుటుంబ సభ్యలు ప్రచారం చేశారు. అయినా..చంద్రబాబును ఓడించినంత పని చేశారాయన. అలా అని తిరుగులేని రాజకీయ చరిత్ర, వ్యూహ రచన, డబ్బు, అధికారం వంటివీ అక్కడి వైసీపీ అభ్యర్థికి లేవు. అయినా, చంద్రబాబు మెజారిటీని బాగా తగ్గించగలిగారు. ఈ విషయమే ఇప్పుడు చంద్రబాబును కలవరపరుస్తోంది. సొంత నియోజకవర్గంలోనూ తన పరపతి తగ్గుతోందా అన్న భయం చంద్రబాబులో మొదలైంది.
ఈ క్రమంలోనే చంద్రబాబు కుప్పంలో పరిస్థితులు తెలుసుకునేందుకు టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాల్లో కుప్పం నియోజకవర్గం పరిస్థితిపై సమీక్ష జరిపారు. 2014 ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ స్థానంలో 70 వేల ఓట్ల మెజారిటీ రాగా, ఈసారి అది 30 వేలకు తగ్గిపోవడంపై చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరీ ఈ స్థాయిలో ఆధిక్యం తగ్గడం వెనుకున్న కారణాలు ఏంటో పరిశీలించాల్సి ఉందని నాయకులకు తెలిపారు.
హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం పట్టణం శివారు ప్రాంతం వరకు నీళ్లు తీసుకువచ్చినా.. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసినా ఎందుకిలాఅయిందని ప్రశ్నించారు. పార్టీ పరంగా, నేతల పరంగా ఉన్న చిన్న చిన్న లోపాలను సవరించుకుని, ఆశావహదృక్పథంతో ముందడుగు వెయ్యాలని అన్నారు. టీడీపీ ఇకపై నిరంతరం పోరాడాలని, వైసీపీ ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేలా వారిపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. తాను త్వరలో కుప్పం వస్తానని.. క్షేత్రస్థాయిలో పార్టీని మళ్లీ బలోపేతం చేస్తానని చంద్రబాబు వారికి చెప్పారు.
అయితే.. చంద్రబాబు కుప్పం నేతలను పిలిపించినా తాను చెప్పడమే తప్ప వారు చెప్పేది వినలేదని.. అలా వినుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని టీడీపీ నేతలు అంటున్నారు.