Begin typing your search above and press return to search.
ఇప్పుడు రివ్యూ చేస్తే కోపం రాక మరేం వస్తుంది బాబు..?
By: Tupaki Desk | 2 July 2015 8:57 AM GMTకీలక స్థానాల్లో వ్యక్తులు మారినంత మాత్రాన మొత్తం వ్యవస్థ మారిపోవాలన్న రూలేం లేదుగా. ఈ చిన్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు గుర్తించటం లేదు? గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏడాది క్రితం పనులు మొదలు పెట్టాలన్న ఆలోచన చేశారు.
దీనికి సంబంధించి స్పష్టమైన ప్రణాళికలు రూపొందించినట్లు.. అత్యద్భుతంగా ఏర్పాట్లు చేస్తామని.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తెలంగాణ సర్కారును తలదన్నేలా పుష్కరాల ఏర్పాట్లు ఉంటాయన్న ధీమాను ఏపీ అధికారపక్షం నేతలు గొప్పలు చెప్పుకునేవారు.
విభజన నేపథ్యంలో.. గోదావరి పుష్కరాల్ని ఏపీ సర్కారు సీరియస్‌గా తీసుకుంటుందని.. మంత్రులు సైతం పనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శిస్తారన్న అంచనాలు వ్యక్తమైనా.. అలాంటి సినిమా ఏమీ లేదన్న విషయం రోజులు గడుస్తున్న కొద్దీ స్పష్టమవుతూ వస్తోంది. మంత్రులకు తగ్గట్లే అధికారులు కూడా చేశామా అంటే చేశామన్నట్లుగా వ్యవహరించటంతో పనులలో ఎలాంటి పురోగతి కనిపించని దుస్థితి.
దీనికితోడు.. సరైన సమయంలో స్పందించి.. పుష్కరాల పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దగా పట్టించుకోకపోవటం కూడా ఓ పెద్ద లోపంగా చెబుతున్నారు. గోదావరి పుష్కరాలు ముంగిట్లోకి వచ్చిన వేళ.. కళ్లు తెరిచిన చంద్రబాబు పనులు పరిశీలిస్తూ.. తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. తొమ్మిదిన్నరేళ్లు.. తాజాగా ఏడాది సీఎంగా.. పదేళ్లు ప్రతిపక్ష నేతగా అనుభవం ఉన్న ఆయనకు.. వ్యవస్థ ఎలా పని చేస్తుందో తెలీదా? నిజంగా పుష్కరాల్ని సూపర్‌డూపర్‌గా నిర్వహించాలని భావిస్తే.. దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి కదా.
అలాంటిదేమీ లేకుండా.. తాజాగా రివ్యూ చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పనులు చేయని అధికారులపై మీడియా ముందే చర్యలు తీసుకుంటానని చిందులు వేయటంలో అర్థం ఏమైనా ఉంటుందా? ఏడాదంతా పట్టించుకోకుండా.. పుష్కరాలు ముంగిట్లోకి వచ్చిన వేళ రివ్యూ చేస్తే ఇలానే ఉంటుంది మరి. పనులు చేయని అధికారుల తప్పు ఎంత ఉందో.. పనుల్ని పర్యవేక్షించని తనది అంతే తప్పు ఉందన్న విషయం చంద్రబాబుకు ఎప్పటికి అర్థం అవుతుందో..?