Begin typing your search above and press return to search.
గుర్రం ఎక్క లేదు కాదు ఖరీదైన బైక్ ఎక్కిన బాబు
By: Tupaki Desk | 19 Feb 2016 5:01 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గుర్రం అంటే ఇష్టం ఉండదా? ఆయనకు బుల్లెట్.. లేదంటే అధునాతన బైకుల్ని విపరీతంగా ఇష్టపడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి సమంజసమైన కారణం లేకపోలేదు. తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటన ఈ అభిప్రాయాన్ని మరింత బలపడేలా చేస్తోంది.
రెండు రోజుల క్రితం ఏపీ రాజధానిలో నిర్వహించిన తాత్కాలిక సచివాలయం శంకుస్థాపన సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకోవటం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు వచ్చిన వెలగపూడి రైతుల్లో ఒకరు.. అమరావతి రాజధాని ప్రాంతంగా ప్రకటించిన తర్వాత తన చిరకాల వాంఛ అయిన గుర్రాన్ని కొనాలన్న కోరికను తీర్చుకున్నట్లు చెప్పారు. అంతేకాదు.. తన గుర్రాన్ని చంద్రబాబు ఎక్కాలని కోరారు. దీనికి బదులుగా మరిన్ని గుర్రాలు కొనాలని చెప్పిన చంద్రబాబు.. అభిమాని కోరినట్లుగా గుర్రం మాత్రం ఎక్కలేదు.
తాజాగా.. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వద్దకు ఒక అభిమాని ఖరీదైన బైక్ ను తీసుకొచ్చారు. రాజధాని రాజసంగా పేరున్న ఈ బైక్ ముందు బాగం పులి తలతో ఉండటం విశేషం. దీని విలువ మిలియన్లలో ఉంటుందని చెబుతున్నారు. ఈ ఖరీదైన వాహనాన్ని తీసుకొచ్చి.. నడపాలని కోరటం.. ఓకే చెప్పేసిన చంద్రబాబు కాస్త దూరం బైక్ నడిపారు. గుర్రం ఎక్కని బాబు ఖరీదైన బైక్ ఎక్కడటం గమనార్హం.