Begin typing your search above and press return to search.
అచ్చెన్న ఆడితే పతకాలు వస్తాయా?
By: Tupaki Desk | 21 Aug 2016 5:21 PM GMTచంద్రబాబునాయుడుకు తనను సీఎం చేసిన ప్రజలన్నా గానీ, కనీసం తన కేబినెట్ కొలీగ్స్ మీద గానీ ఏమాత్రం గౌరవం ఉండదని చాలా సందర్భాల్లో బిహైండ్ ది స్క్రీన్ సంగతులు వినవస్తూ ఉంటాయి. అలాంటిదే ఇది కూడా ఒకటి. సాక్షాత్తూ తన కేబినెట్‌లోని క్రీడల మంత్రిని నలుగురిలో నవ్వులపాలయ్యేలా సీఎం మాట్లాడడం ఖచ్చితంగా గర్హనీయమే.
విషయం ఏంటంటే.. చంద్రబాబు కేబినెట్ మీటింగులో సింధుకు మూడుకోట్ల రూపాయలు ఇవ్వడం గురించి చర్చ వచ్చినప్పుడు అంతా ఓకే అన్నారుట. సింధు చాలా బాగా ఆడింది సార్ అంటూ ఏపీ స్పోర్ట్స్ మినిస్టరు కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పాట్ట. 'నువ్వే సరిగ్గా ఆడలేకపోతున్నావ్' అంటూ.. మన రాష్ట్రంలో స్పోర్ట్స్ డెవలప్ మెంట్ కు చేపడుతున్న పనులు సరిగా లేవని అందుకే క్రీడలు అభివృద్ధి కావడం లేదని అర్థం వచ్చేలా మాట్లాడారుట. దీంతో అక్కడున్న అందరూ ఫక్కున నవ్వుకున్నారు.
అయితే సాధారణంగానే మంత్రి అచ్చెన్నాయుడు తన మీద ఎవరు జోకులేసినా పట్టించుకునే రకం కాదు. తేలిగ్గా తీసుకుంటారు. కానీ.. ఇక్కడ సందర్భం వేరు. అయినా అచ్చెన్నాయుడు ఆడితే పతకాలు వస్తాయా ఏంటి.. చంద్రబాబు అలాంటి జోకులు ఎలా వేస్తారు.. అంటూ పలువురు అంటున్నారు. అచ్చెన్నాయుడు ఏదో ప్రతిపక్షాన్ని విమర్శించడానికే తప్ప.. చంద్రబాబు వద్ద నోట్లో నాలుక లేని నాయకుడు గనుక.. ఏమన్నా సరే చెల్లుతుందని అనుకుంటున్నాడేమో అని కూడా పలు వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.