Begin typing your search above and press return to search.
మంత్రులపై బాబు సెటైర్ విన్నారా?
By: Tupaki Desk | 11 Oct 2017 4:38 AM GMTసీఎం చంద్రబాబు సమావేశం నిర్వహిస్తే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే! సహనానికి మరో పేరులాంటిది! ప్రతి మీటింగులో చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెబుతూ.. ఒకటికి పదిసార్లు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ ఉంటారు! పొద్దున్నుంచి మధ్యాహ్నం.. అక్కడి నుంచి సాయంత్రం.. ఆపై ఒక్కోసారి రాత్రి వరకూ నిరంతరాయంగా, ఏకధాటి గా కొనసాగుతూనే ఉంటుంది!! మీటింగ్ ఎప్పుడు అయిపోతుందోనని వేచిచూస్తూ ఉంటారు! పాపం.. ప్రజలంటే బయటికి వెళిపోతారు.. మరి కేబినెట్ సమావేశంలో మంత్రులు ఎక్కడికి వెళ్లలేరు కదా! నిన్న నిర్వహించిన సమావేశంలోనూ మంత్రులు బాగా అలసిపోవడం గమనించిన బాబు.. వాళ్లపై సెటైర్ వేసి.. వారి అలసటను పోగొట్టారు!!
ఏపీ కేబినెట్ సమావేశం ఎప్పటిలానే చాలా సుదీర్ఘంగా జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే అన్ని పథకాలకు ముందు తన పేరు జోడించేసుకుని.. చంద్రన్న తోఫా - చంద్రన్న దసరా కానుక - చంద్రన్న బీమా - చంద్రన్న సంచార వైద్యం.. ఇలా మార్చేసుకున్న ఆయన.. `చంద్రన్న పెళ్లి కానుక` అనే సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. బీసీ సామాజిక వర్గంలో పెళ్లి చేసుకునే పేద వధూవరులకు 'చంద్రన్న పెళ్లి కానుక' పేరుతో రూ.30వేలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రన్న పెళ్లి కానుకను 2018 జనవరి 1 నుంచి అమల్లోకి తేవాలని యోచిస్తున్నట్టు సమాచారం.
మరోవైపు మూడో విడత రైతు రుణమాఫీ - ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. రాష్ట్రంలో డెంగ్యూ మరణాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీతో వ్యాధుల నివారణ చేపట్టాలని కేబినెట్ లో చంద్రబాబు తెలిపారు. అయితే ఇక చివరిలో రాజధానిలో నూతనంగా నిర్మించే ఎమ్మెల్యేల నివాసాలపై సీఆర్ డీఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అందజేశారు. ఎప్పుడూ వినే అంశాలే అనుకున్నారో లేక.. పొద్దున్నుంచీ వినీవినీ నీరసం వచ్చిందో తెలీదుగాని మంత్రులు మాత్రం ఫుల్లుగా అలిసిపోయారట. దీంతో అందరూ ప్రజెంటేషన్ బ్రహ్మాండంగా ఉందని ముక్తకంఠంతో చెప్పారట. అయితే మంత్రులు అలిసిపోయి ఇలా చెప్పారని గమనించిన చంద్రబాబు.. దానిని చమత్కరించారు. తమరు అలిసిపోయి ఇంటికి వెళ్లాలనే తొందరలో అలా చెబుతున్నారులే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం మరోసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పరిశీలిద్దామని చెప్పి సీఎం ముగించారట. దీంతో మంత్రులంతా ఊపిరి పీల్చుకున్నారట.