Begin typing your search above and press return to search.
ఫైన్ అంటూ నవ్వులు పూయించిన బాబు
By: Tupaki Desk | 14 Aug 2015 5:10 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సింగపూర్ దేశాన్ని పొగిడేయటం తెలిసిందే. ప్రపంచంలో చాలానే దేశాలున్నా.. ఇద్దరు చంద్రుళ్లు ఏదైనా గొప్పలు చెప్పాల్సి వచ్చినప్పుడు తరచూ సింగపూర్ గురించి ప్రస్తావిస్తుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే.. తాము అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం సింగపూర్ కంటే సూపర్ అని తమను తాము పొగిడేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ ‘ఫైన్’ దేశమని చెప్పటం.. అలవాటులో భాగంగా బాబు ఆ దేశాన్ని పొగిడేస్తున్నారని అనుకున్న వారికి పంచ్ ఇచ్చి.. నవ్వులు పూయించారు. సీరియస్ గా.. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే.. కాస్త విసుగ్గా ఉండే బాబు సంభాషణల్లో పిట్టకథలు.. ఆసక్తికర అంశాలు చాలా తక్కువ.
దాన్ని తీరిస్తూ.. తాజాగా విజయవాడలో ఏర్పాటు చేసిన సదస్సులో బాబు చేసిన ప్రసంగం నవ్వులు విరబూసేలా చేసింది. సింగపూర్ ను ఫైన్ (మంచి) దేశంగా అని భావించినా.. తాను చెప్పేది ఫైన్ (జరిమానా) అన్న విషయాన్ని విడమర్చి చెప్పి ఘోల్లుమనేలా చేశారు. కఠినమైన నిబంధనల కారణంగానే సింగపూర్ అభివృద్ధిలో క్రమశిక్షణ కలగలిసిపోయిందని చెప్పిన ఆయన.. ఒక ఉదంతాన్ని ప్రస్తావించారు.
కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు తదితరులతో కలిసి తాను సింగపూర్ వెళ్లానని.. ఎప్పుడూ సిగిరెట్ కాల్చే అశోక్ గజపతిరాజు.. సింగపూర్ లో ఉన్నంత కాలం మాత్రం సిగిరెట్ కాల్చలేదన్నారు. ఎందుకని అడిగితే.. సింగపూర్ లో సిగిరెట్ కాలిస్తే 500 సింగపూర్ డాలర్ల జరిమానా విధిస్తారని.. తన దగ్గర అంత డబ్బుల్లేవని చెప్పారన్నారు.
సింగపూర్ లో ఉన్నంత కాలం సిగిరెట్ విషయంలో అంత స్ట్రిక్ గా ఉన్న అశోక్ గజపతి రాజు.. దేశానికి తిరిగి వచ్చిన వెంటనే మాత్రం మళ్లీ తన సిగిరెట్ అలవాటును కొనసాగించరంటూ బాబు చెప్పిన తీరు సభికుల్ని నవ్వుల్లో ముంచెత్తింది. బోర్ కొట్టే విధంగా కాకుండా.. ఇలా హుషారు పుట్టించేలా చంద్రబాబు మాట్లాడితే ఎంత బాగుండు అని ఆశ పడిన వారూ ఉన్నారనుకోండి. అదంత ఈజీ కాదు కదా..?