Begin typing your search above and press return to search.
సామాన్యుడికి సారీ చెప్పిన చంద్రబాబు
By: Tupaki Desk | 16 Jan 2018 4:00 PM GMTపండుగ రోజు...ఏపీ ముఖ్యమంత్రి...తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పారు. అది కూడా ఓ సామాన్యుడికి తనవల్ల ఇబ్బంది పడినందుకు! ఈ ఘటన జరిగింది చంద్రబాబు స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో!సంక్రాంతికి స్వగ్రామమైన నారావారిపల్లెకు వెళ్లిన సీఎంకు స్థానికులు తమ సమస్యలపై అర్జీలు అందజేయడానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సహజంగానే సీఎం చంద్రబాబు ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆపై రెండు గంటల పాటు ఎటువంటి వాహనాలు సామాన్యులను అటువైపుగా వెళ్లనివ్వలేదు.
మరోవైపు చంద్రబాబు నాయుడు తమ ఇంటి ముందు కూర్చుని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జనం భారీగా రావటంతో రెండు గంటలపాటు అటువైపు వెళ్లే వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. అదే సమయంలో నవీన్ అనే వ్యక్తి తమ కుటుంబంతో.. కిలోమీటర్ దూరం నడిచి దిగువ మూర్తిపల్లె గ్రామానికి వెళుతున్నాడు. కాలినడకన పోతూ సీఎం ఇంటి దగ్గరకు చేరుకోగానే.. అక్కడ పోలీసుల తీరుపై నవీన్ అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యమంత్రి వల్లే తాము కిలోమీటరు నడవాల్సి వచ్చిందని భావించిన నవీన్ అక్కడున్న పోలీసులపై కామెంట్ చేశారు. అదంతా గమనించిన సీఎం చంద్రబాబు సారీ చెప్పక తప్పలేదు . వెంటనే ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని పోలీసులను అదేశించారు. దీంతో తన ఇబ్బంది గుర్తించిన సీఎంకు నవీన్ కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయాడు.