Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ తో బాబు పోటీ!...రాజ‌మండ్రిలో కుదిరేనా?

By:  Tupaki Desk   |   2 March 2019 8:34 AM GMT
జ‌గ‌న్‌ తో బాబు పోటీ!...రాజ‌మండ్రిలో కుదిరేనా?
X
అసెంబ్లీ - సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతున్న కొద్దీ... ఏపీలో రాజ‌కీయం అంత‌కంత‌కూ వేడెక్కిపోతోంది. ఈ ఎన్నిక‌లు అటు విప‌క్ష వైసీపీతో పాటు ఇటు అధికార టీడీపీకి కూడా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన నేప‌థ్యంలో ప్ర‌తి సీటు కూడా కీల‌కంగానే మారిపోయింద‌ని చెప్పాలి. అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఇప్ప‌టికే ఈ రెండు పార్టీలు క‌స‌ర‌త్తులు మొద‌లెట్టినా... ఇప్ప‌టికీ కొన్ని సీట్ల విష‌యంలో ఇంకా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయ‌ని చెప్పాలి. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైసీపీ అధినేత కొన్ని సీట్ల‌ను ఆయా సామాజిక వ‌ర్గాల‌కు కేటాయిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఆ దిశ‌గా ఆయ‌న ఇప్ప‌టికే స‌ద‌రు సీట్ల అభ్యర్థుల‌పైనా ఓ అంచనాకు వ‌చ్చార‌నే చెప్పాలి. ఇలాంటి సీట్ల‌లో జ‌గ‌న్ బీసీల‌కు కేటాయించిన సీట్ల‌లో... టీడీపీ అనివార్యంగా బీసీల‌నే నిల‌బెట్టాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే... బీసీల‌కు న్యాయం చేసే పార్టీ త‌న‌దేన‌ని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు... జ‌గ‌న్ బీసీల‌కు కేటాయించిన సీట్ల‌ను ఇత‌ర వ‌ర్గాల‌కు కేటాయించే ప‌రిస్థితి లేద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌గా వినిపిస్తోంది.

ఇలాంటి సీట్ల విష‌యానికి వ‌స్తే... తూర్పు గోదావ‌రి జిల్లాలోని రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సీటు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇక్క‌డ ప్ర‌స్తుతం టీడీపీ నేత మాగంటి ముర‌ళీమోహ‌న్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈయ‌న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో... ఆ సీటును జ‌గ‌న్ బీసీల‌కు కేటాయించిన నేప‌థ్యంలో ఇప్పుడు ముర‌ళీమోహ‌న్‌ కు అక్క‌డ అవ‌కాశం చిక్కేలా లేదు. పార్టీ అధిష్ఠానం నుంచి ఈ మేర‌కు స‌మాచారం అందుకున్న త‌ర్వాతే... ఈ ద‌ఫా ఎన్నిక‌ల నుంచి తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ముర‌ళీమోహ‌న్ చాలా తెలివిగా ప్ర‌క‌టించేశార‌న్న వాద‌నా లేక‌పోలేదు. ముర‌ళీమోహ‌న్ త‌ప్పుకున్న త‌ర్వాత‌... ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దింపే బీసీ నేత ఎవ‌ర‌న్న విష‌యంపై టీడీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఈ సీటును బీసీల‌కు కేటాయించిన జ‌గ‌న్‌... అదే సామాజిక వ‌ర్గానికి చెందిన మార్గాని భ‌ర‌త్ ను ఆ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు. టికెట్ కూడా దాదాపుగా భ‌ర‌త్‌ కేన‌ని తెలుస్తోంది. ప్ర‌ముఖ సినీ న‌టి జ‌య‌ప్ర‌ద కూడా ఈ సీటును ద‌క్కించుకునే క్ర‌మంలో వైసీపీలో చేర‌తార‌న్న ప్ర‌చారం సాగుతోంది.

వైసీపీ సీటు కోసం ఓ మోస్త‌రు పోటీ నెల‌కొన్నా... టీడీపీ నుంచి బ‌రిలోకి దిగే బీసీ నేత ఆ పార్టీలో క‌నిపించ‌డం లేదు. దివంగ‌త ఎంపీ ఎర్ర‌న్నాయుడు కూతురు - ఆదిరెడ్డి అప్పారావు కోడ‌లు భ‌వానీని ఈ ద‌ఫా రాజకీయాల్లోకి దించే దిశ‌గా య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇటీవలే ఆదిరెడ్డి అప్పారావు త‌న కోడ‌లును అమ‌రావ‌తికి తీసుకునివ‌చ్చి చంద్ర‌బాబుకు ప‌రిచ‌యం చేశారు. అయితే భ‌వానీకి రాజమండ్రి టికెట్ ఇస్తే... ఎర్ర‌న్నాయుడి కుటుంబానికి ఏకంగా రెండు ఎంపీ సీట్ల‌ను ఇచ్చిన‌ట్ట‌వుతుంది. ఎలాగంటే... ఇప్ప‌టికే శ్రీ‌కాకుళం ఎంపీగా ఉన్న ఎర్ర‌న్న కుమారుడు రామ్మోహ‌న్ నాయుడు... ఈ ద‌ఫా కూడా అదే సీటు నుంచి పోటీ చేయ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఈ లెక్క‌న ఎర్ర‌న్న కుటుంబానికి రెండు సీట్లు ఇస్తే... ఇత‌ర నేత‌ల నుంచి తీవ్ర ఒత్తిడి వ‌చ్చే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అందుకే ఎర్రంనాయుడు కుమార్తెకి రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారట! బుచ్చయ్య చౌదరి కి రాజమండ్రి రూరల్ టికెట్ ఇస్తారట ! ఈ నేప‌థ్యంలో రాజ‌మండ్రి ఎంపీ సీటు బ‌రిలోకి దిగి - వైసీపీ అభ్య‌ర్థిని ఢీకొట్ట‌గ‌లిగిన నేత కోసం చంద్ర‌బాబు వెతుకుతున్నార‌ట‌. మ‌రి ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఏ మేర‌కు ఫలిస్తాయో చూడాలి.

...ఎస్ ఆర్ కే