Begin typing your search above and press return to search.
ఢిల్లీలో బాబు సీక్రెట్ మీటింగ్స్!
By: Tupaki Desk | 13 May 2017 4:57 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమెరికా పర్యటనను ముగించుకొచ్చిన ఆయన శుక్రవారం మధ్యాహ్నానికి ఢిల్లీకి చేరుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడ నుంచే అసలు ముచ్చట మొదలైంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న తర్వాత.. వెంటనే ఆయన బయలుదేరాల్సి ఉంది. అయితే.. దాదాపు ఆరు గంటలు ఆయన అందుబాటులో లేని వైనం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు.
అమెరికా నుంచి ఢిల్లీకి శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో చేరుకొని.. ఆ తర్వాత విజయవాడకు 3.55 గంటలకు బయలుదేరుతారని మీడియాకు చెప్పారు. కానీ.. రాత్రి తొమ్మిది గంటల వరకూ ముఖ్యమంత్రి ఎయిర్ పోర్ట్ లాంజ్ లోనే ఉన్నట్లుగా సీఎం ప్రభుత్వ.. ప్రైవేటు సిబ్బంది మీడియాను నమ్మించారు. అయితే.. ఆ ఆరు గంటల పాటు బాబు ఎయిర్ పోర్ట్ లో లేరని.. ఢిల్లీ నగరంలో కొందరు ప్రముఖుల్ని.. ముఖ్యులతో ఆయన కలిసినట్లు తెలుస్తోంది.
అమెరికా పర్యటన ముగించుకొని దేశ రాజధాని చేరుకొని.. అక్కడ నుంచి నేరుగా బెజవాడకు రావాల్సిన బాబు.. ఢిల్లీలో ఆరు గంటల పాటు ఎవరిని కలిశారు? ఏం మాట్లాడారు? తన భేటీల్ని ఎందుకంత గోప్యంగా ఉంచాల్సి వచ్చింది? షెడ్యూల్ కు భిన్నంగా బాబు ఎందుకు వ్యవహరించినట్లు? లాంటి సందేహాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో రేకెత్తాయి.
షెడ్యూల్ కు భిన్నంగా ఆయన అంత రహస్యంగా ఎవరిని కలవాల్సి వచ్చిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఆయన.. రాత్రి తొమ్మిదిన్నర వరకూ ఎయిర్ పోర్ట్ లోనే ఎందుకు ఉన్నట్లు? అన్న ప్రశ్నను మీడియా వర్గాలనే కాదు.. రాజకీయ వర్గాల్లోనే ఈ అంశం ఆసక్తికర చర్చకు తెర తీసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/